Maruti Suzuki e Vitara SUV: మారుతి మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ..సెప్టెంబర్ 3న సేల్.. అప్‌డేట్స్ అదిరాయ్..!

Maruti Suzuki e Vitara SUV: మారుతి మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ..సెప్టెంబర్ 3న సేల్.. అప్‌డేట్స్ అదిరాయ్..!
x
Highlights

Maruti Suzuki e Vitara SUV: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మారుతి సుజుకి ఇ-విటారా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లాంచ్ కోసం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇది సెప్టెంబర్...

Maruti Suzuki e Vitara SUV: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మారుతి సుజుకి ఇ-విటారా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లాంచ్ కోసం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇది సెప్టెంబర్ 3న ఘనంగా అమ్మకానికి రానుంది. ఈ కారును స్వాగతించడానికి వినియోగదారులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇందులో చాలా మంచి డిజైన్, అనేక ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ సరికొత్త ఇ-విటారా అంచనా ధర, స్పెసిఫికేషన్‌లను వివరంగా తెలుసుకుందాం.

New Maruti Suzuki e Vitara SUV Price

కొత్త మారుతి ఇ-విటారా ఎస్‌యూవీ పోటీ ధరకు కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు, కనిష్ట ధర రూ. 17 లక్షలు, గరిష్ట ధర రూ. 22.50 లక్షలు ఎక్స్-షోరూమ్ ఉంటుందని అంచనా. ఇది 3 వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది - డెల్టా, జీటా, ఆల్ఫా.

New Maruti Suzuki e Vitara SUV Specifications

ఈ సంవత్సరం జనవరిలో ముగిసిన 'భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎలక్స్‌పో'లో కూడా ఇదే కారును ప్రదర్శించారు. అక్కడ, కొత్త 'ఇ-విటారా' గురించి అన్ని ముఖ్యమైన వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వెలుపల చక్కని డిజైన్‌ ఉంది, ఇది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం ఖాయం. దీనికి ఎల్ఈడీ హెడ్‌లైట్లు, ఎల్ఈడీ డీఆర్ఎల్‌లు, ఫాగ్ లైట్లు, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

ఈ మారుతి సుజుకి ఈ-విటారా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ చాలా విశాలమైనది. ఇది 4,275 మి.మీ పొడవు, 4,275 మి.మీ వెడల్పు, 1,800 మి.మీ ఎత్తు ఉంది. దీనికి 180 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్, 2,700 మి.మీ వీల్‌బేస్ కూడా ఉంది. కొత్త ఇ-విటారా కారులో 5 సీట్లు ఉన్నాయి, కాబట్టి ప్రయాణీకులు సౌకర్యవంతంగా కూర్చుని ప్రయాణించచ్చు. సెలవు దినాల్లో సుదూర నగరాలకు ప్రయాణాలకు వెళ్లేటప్పుడు ఎక్కువ సామాను తీసుకెళ్లగలిగేలా 398 లీటర్ల భారీ బూట్ స్పేస్ కూడా అందించారు.

దీని పవర్‌ట్రెయిన్ గురించి ఎక్కువ వివరాలు అందుబాటులో లేవు. కొత్త ఇ-విటారాలో 49 కిలోవాట్లు, 61 కిలోవాట్లు సామర్థ్యం కలిగిన రెండు బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. ఇది పూర్తిగా ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు పరిధిని అందిస్తుందని చెబుతున్నారు. ఈ ఇ-విటావా కారు డిజైన్ చాలా బాగుంది. ప్రయాణీకుల సౌలభ్యం కోసం10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటో ఏసీ వంటి వివిధ ఫీచర్లు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories