Yezdi Roadster : రాయల్ ఎన్‌ఫీల్డ్‎కు షాక్.. కొత్త యెజ్దీ రోడ్‌స్టర్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే

Yezdi Roadster : రాయల్ ఎన్‌ఫీల్డ్‎కు షాక్.. కొత్త యెజ్దీ రోడ్‌స్టర్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
x
Highlights

Yezdi Roadster : భారత మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు పోటీ ఇవ్వడానికి యెజ్దీ సంస్థ సిద్ధమైంది. సరికొత్త లుక్‌తో, పవర్ఫుల్ ఇంజిన్‌తో తమ అప్‌డేటెడ్ రోడ్‌స్టర్ బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.

Yezdi Roadster : భారత మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు పోటీ ఇవ్వడానికి యెజ్దీ సంస్థ సిద్ధమైంది. సరికొత్త లుక్‌తో, పవర్ఫుల్ ఇంజిన్‌తో తమ అప్‌డేటెడ్ రోడ్‌స్టర్ బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.2.10 లక్షలుగా నిర్ణయించారు. ఈ కొత్త బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటెయోర్ 350, హార్లే-డేవిడ్‌సన్ X440 వంటి బైక్‌లతో నేరుగా పోటీ పడనుంది. పాత మోడల్ కంటే చాలా మెరుగుదలలతో వచ్చిన ఈ కొత్త యెజ్దీ బైక్ వివరాలు, ఫీచర్లు, ఇతర బైకులతో ఎలా పోటీ పడుతుందో ఈ వార్తలో తెలుసుకుందాం.

యెజ్దీ తన రోడ్‌స్టర్ మోడల్‌ను 2025 ఏడాదికి అప్‌డేట్ చేసి లాంచ్ చేసింది. ఈ కొత్త బైక్ బిల్డ్ క్వాలిటీలో మెరుగుదలలు, కొత్త ఇంజిన్ మరిన్ని అడ్వాన్సుడ్ ఫీచర్లతో వచ్చింది. మునుపటి మోడల్‌తో పోలిస్తే కొత్త బైక్‌లో చాలా మార్పులు చేశారు. అప్‌డేటెడ్ రోడ్‌స్టర్ కొత్త కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది బైక్‌కు మరింత ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తుంది. కొత్త LED హెడ్‌ల్యాంప్, టెయిల్‌లైట్, అలాగే కొత్త ఇండికేటర్లు బైక్‌కు ఒక లేటెస్ట్ టచ్‌ను ఇస్తాయి. మెరుగైన బ్రేకింగ్ కోసం ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లతో పాటు డ్యూయల్-ఛానల్ ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) అమర్చారు. సస్పెన్షన్ కోసం ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, వెనుక వైపున ప్రీలోడ్-అడ్జస్టబుల్ ట్విన్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి.

యెజ్దీ కొత్త రోడ్‌స్టర్‌లో యెజ్దీ అడ్వెంచర్ బైక్‌లో వాడిన ఆల్ఫా2 ఇంజిన్‌ను అప్‌డేట్ చేసి ఉపయోగించారు. ఈ కొత్త ఇంజిన్ 29 BHP పవర్, 29.8 Nm పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానించబడి, స్మూత్ రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. 2025 యెడ్జీ రోడ్‌స్టర్ తన ధర, పనితీరు, ఫీచర్ల విషయంలో మార్కెట్‌లోని మోడరన్-రెట్రో సెగ్మెంట్‌లోని అనేక బైక్‌లకు గట్టి పోటీ ఇస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటెయోర్ 350 ఎక్స్-షోరూమ్ ధర రూ.2.08 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. హోండా CB 350 ప్రారంభ ధర రూ.2 లక్షలు (ఎక్స్-షోరూమ్). హార్లే-డేవిడ్‌సన్ X440 ధర రూ.2.40 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ పోటీలో యెజ్దీ తన ప్రత్యేకమైన ఫీచర్లు, అప్‌డేటెడ్ ఇంజిన్‌తో మార్కెట్‌లో తన స్థానాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories