Nissan: ఎర్టిగాకు చుక్కలు చూపిస్తున్న నిస్సాన్ కొత్త కారు.. దానికన్నా రూ.3లక్షలు తక్కువకే 7 సీటర్

Nissan: ఎర్టిగాకు చుక్కలు చూపిస్తున్న నిస్సాన్ కొత్త కారు.. దానికన్నా రూ.3లక్షలు తక్కువకే 7 సీటర్
x
Highlights

ఎర్టిగాకు చుక్కలు చూపిస్తున్న నిస్సాన్ కొత్త కారు.. దానికన్నా రూ.3లక్షలు తక్కువకే 7 సీటర్

Nissan: ఫ్యామిలీతో కలిసి హాయిగా ప్రయాణించడానికి 7 సీటర్ కారు కొనాలనుకుంటున్నారా? అయితే మీకు ఒక అదిరిపోయే ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్, తన సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఎంపీవీ నిస్సాన్ గ్రావైట్‎ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ధర ఎంత తక్కువంటే.. ప్రస్తుతం మార్కెట్లో రారాజుగా ఉన్న మారుతి ఎర్టిగా కంటే ఏకంగా రూ.3.15 లక్షలు తక్కువ. బడ్జెట్ తక్కువ ఉన్నా, ఫ్యామిలీ అంతా పట్టే కారు కావాలనుకునే వారికి ఇది ఒక గొప్ప వరంలా మారింది.

నిస్సాన్ గ్రావైట్ ధరలు మన దేశంలో రూ.5.65 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై, టాప్ ఎండ్ వేరియంట్ రూ.8.93 లక్షల వరకు ఉన్నాయి. మరోవైపు, మారుతి సుజుకి ఎర్టిగా ప్రారంభ ధర రూ.8.80 లక్షల నుంచి ఉండగా, టాప్ మోడల్ రూ.12.94 లక్షల వరకు పలుకుతోంది. అంటే ఎర్టిగా బేస్ మోడల్ ధరతో మీరు గ్రావైట్ టాప్ మోడల్‌ను సొంతం చేసుకోవచ్చు. సుమారు మూడు లక్షలకు పైగా వ్యత్యాసం ఉండటం మధ్యతరగతి సామాన్యులను గ్రావైట్ వైపు ఆకర్షిస్తోంది.

నిస్సాన్ గ్రావైట్ 1.0 లీటర్, 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 71 bhp పవర్, 96 Nm టార్క్ ఇస్తుంది. ఇది సిటీ డ్రైవింగ్‌కు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అదే సమయంలో మారుతి ఎర్టిగాలో పెద్దదైన 1.5 లీటర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 103 bhp పవర్, 136.8 Nm టార్క్‌ను అందిస్తుంది. మీకు ఎక్కువ పవర్ కావాలంటే ఎర్టిగా బెటర్, కానీ సిటీలో తిరగడానికి, తక్కువ బడ్జెట్‌లో 7 సీట్లు కావాలంటే గ్రావైట్ బెస్ట్ ఆప్షన్.

గ్రావైట్ కారు చూడటానికి స్టైలిష్‌గా ఉండటమే కాకుండా.. 8 ఇంచుల టచ్‌స్క్రీన్, 6 ఎయిర్‌బ్యాగ్స్ (స్టాండర్డ్), వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఆధునిక ఫీచర్లతో వస్తుంది. ఇది లీటరుకు సుమారు 19.6 కి.మీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఎర్టిగా కూడా దాదాపు ఇదే స్థాయిలో 20.5 కి.మీ మైలేజ్ ఇస్తుంది. రెనాల్ట్ ట్రైబర్ ప్లాట్‌ఫామ్‌పై వచ్చిన ఈ గ్రావైట్, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకునేలా కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories