
రూ.6 లక్షలకే 7 సీటర్ కారు..నిస్సాన్ నుంచి అదిరిపోయే బడ్జెట్ ఫ్యామిలీ ప్యాక్
Nissan Gravite MPV : జపనీస్ కార్ల దిగ్గజం నిస్సాన్ భారత మార్కెట్లో తన ఉనికిని చాటుకునేందుకు సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసింది. తన మొదటి మల్టీ పర్పస్ వెహికల్ గా వస్తున్న నిస్సాన్ గ్రావిటేకు సంబంధించిన టీజర్‌ను కంపెనీ తాజాగా విడుదల చేసింది. మారుతి అల్ట్రా పాపులర్ మోడల్ ఎర్టిగా, రెనాల్ట్ ట్రైబర్ వంటి కార్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు ఈ 7-సీటర్ కారు ఫిబ్రవరిలో అధికారికంగా మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. నిస్సాన్ గ్రావిటే చూసేందుకు చాలా మోట్రన్ గా కనిపిస్తోంది. ఇది రెనాల్ట్ ట్రైబర్ ఆధారంగా తయారైనప్పటికీ, నిస్సాన్ తనదైన శైలిలో మార్పులు చేసింది. ముందు భాగంలో స్టైలిష్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, హారిజాంటల్ క్రోమ్ గ్రిల్, బోనెట్‌పై GRAVITE అని రాసి ఉన్న బ్యాడ్జింగ్ దీనికి ప్రత్యేక గుర్తింపునిస్తాయి. వెనుక వైపు కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్, స్పోర్టీ బంపర్ దీనికి ప్రీమియం లుక్ ఇస్తాయి. కంపెనీ తన హీరో కలర్ గా టీల్ షేడ్‌ను ప్రమోట్ చేస్తోంది. దీనితో పాటు వైట్, సిల్వర్, బ్లాక్, గ్రే రంగుల్లో ఈ కారు లభిస్తుంది.
సాంకేతిక వివరాలను నిస్సాన్ ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఇందులో రెనాల్ట్ ట్రైబర్‌లోని 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. ఇది 71 bhp పవర్, 96 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, నిస్సాన్ తన మాగ్నైట్‌లోని 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కూడా గ్రావిట్లో ఆప్షన్‌గా ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది 100 bhp పవర్‌తో హైవేలపై అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇవ్వగలదు. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉండనున్నాయి.
Inspired by India and its many shades.
— Nissan India (@Nissan_India) January 24, 2026
The celebration of a nation coming together is almost here.
The all-new Nissan Gravite.
February 2026. Stay tuned.#Nissan #NissanIndia #NissanGravite #ComingSoon #DefyOrdinary pic.twitter.com/v3CLcEJ1p3
లోపల ఏడుగురు సౌకర్యవంతంగా కూర్చునేలా మూడు వరుసల సీట్లు ఉంటాయి. 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 7-అంగుళాల డిజిటల్ క్లస్టర్, వైర్లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉండబోతున్నాయి. సేఫ్టీ విషయంలో నిస్సాన్ అస్సలు తగ్గడం లేదు. 6 ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, హిల్-స్టార్ట్ అసిస్ట్, రియర్ పార్కింగ్ కెమెరా, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ వంటి ఫీచర్లు గ్రావిట్లో రానున్నాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




