Nissan X-TRAIL Discount: రూ.21 లక్షల భారీ తగ్గింపు.. కొత్తగా కారు కొనే వారికి మతిపోయే డిస్కౌంట్ ఆఫర్లు..!

Nissan X-TRAIL Gets RS 30 Lakhs Discount Check all Offers and more
x

Nissan X-TRAIL Discount: రూ.21 లక్షల భారీ తగ్గింపు.. కొత్తగా కారు కొనే వారికి మతిపోయే డిస్కౌంట్ ఆఫర్లు..!

Highlights

Nissan X-TRAIL Discount: టయోటా ఫార్చ్యూనర్‌కు గట్టి పోటీనిచ్చేందుకు, నిస్సాన్ ఇండియా తన ప్రీమియం ఎస్యూవీ ఎక్స్-ట్రైల్ ను మార్కెట్లోకి విడుదల చేసింది.

Nissan X-TRAIL Discount: టయోటా ఫార్చ్యూనర్‌కు గట్టి పోటీనిచ్చేందుకు, నిస్సాన్ ఇండియా తన ప్రీమియం ఎస్యూవీ ఎక్స్-ట్రైల్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. కానీ ఈ కారు అమ్మకాలు క్షీణిస్తూనే ఉన్నాయి. నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 49.92 లక్షలు కానీ ఇప్పుడు దాని ధర కేవలం రూ. 30 లక్షలకు తగ్గించింది. ఈ ఎస్యువీపై రూ.21 లక్షల డిస్కౌంట్ ఇస్తున్నారు. సమాచారం కోసం, నిస్సాన్ ఆగస్టు 2024లో భారతదేశంలో 150 యూనిట్ల ఎక్స్-ట్రైల్‌ను ఆర్డర్ చేసింది. కానీ, దాని అధిక ధర, లిమిటెడ్ ఫీచర్ల కారణంగా, ఈ కారు అమ్మకాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ప్రీమియం డీలర్లు దీనిపై భారీ డిసాంట్లు అందిస్తున్నారు.

Nissan X-TRAIL Engine

ఎక్స్-ట్రైల్ 1.5-లీటర్, 3-సిలిండర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 160బిహెచ్‌పి పవర్, 300ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ శక్తివంతమైనది కాదు, ఇది మాత్రమే కాదు, డిజైన్, ఫీచర్ల పరంగా ఎక్స్-ట్రైల్ అంత గొప్ప ఎస్యూవీ కాదు.

Nissan X-TRAIL Sales

నిస్సాన్ ఎక్స్-ట్రైల్ అమ్మకాలు నిరంతరం పడిపోతున్నాయి, గత 6 నెలల్లో కేవలం 18 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గత నెలలో ఈ కారు 15 యూనిట్లు అమ్ముడయ్యాయి. దీనికి ముందు, జనవరి, ఫిబ్రవరిలో ఒక్క కారు కూడా అమ్ముడుపోలేదు. పేలవమైన అమ్మకాలు కంపెనీకి ఆందోళన కలిగించే విషయంగా మారుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అమ్మకాలు పడిపోవడం వల్ల కంపెనీ దానిని నిలిపివేయవచ్చు.

Nissan X-TRAIL Specifications

ఎక్స్-ట్రైల్ అనేది 7 సీట్ల ఎస్యూవీ. ఇందులో మంచి స్థలం ఉంది. ఈ కారు పొడవు 4680మిమీ. కారు వెడల్పు 184మిమీ, ఎత్తు 1725మిమీ. ఈ కారు వీల్‌బేస్‌ 2705మిమీ. ఇది దీనికి విలాసవంతమైన రూపాన్ని ఇస్తుంది. భద్రత కోసం 7 ఎయిర్‌బ్యాగులు అందించారు. ఈ కారు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌లో వస్తుంది. ఈ కారులో ఎల్ఈడీ, హెడ్‌లైట్లు, స్టైలిష్ టెయిల్‌లైట్లు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories