Mahindra : తక్కువ ధరలో ఎక్కువ రేంజ్..మహీంద్రా లేటెస్ట్ ఈవీలపై ఏకంగా రూ.4లక్షల తగ్గింపు

Mahindra
x

Mahindra : తక్కువ ధరలో ఎక్కువ రేంజ్..మహీంద్రా లేటెస్ట్ ఈవీలపై ఏకంగా రూ.4లక్షల తగ్గింపు

Highlights

Mahindra : మహీంద్రా తన ఎలక్ట్రిక్ కార్లైన బీఈ 6, ఎక్స్‌ఈవీ 9ఈ లాంగ్ రేంజ్ వేరియంట్‌ల ధరలను గణనీయంగా తగ్గించింది.

Mahindra : మహీంద్రా తన ఎలక్ట్రిక్ కార్లైన బీఈ 6, ఎక్స్‌ఈవీ 9ఈ లాంగ్ రేంజ్ వేరియంట్‌ల ధరలను గణనీయంగా తగ్గించింది. దేశీయ కార్ల తయారీ సంస్థ మహీంద్రా ప్రకటించిన ప్రకారం.. ఇప్పుడు బీఈ 6, ఎక్స్‌ఈవీ 9ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల ప్యాక్ 2 వేరియంట్‌లలో కూడా పెద్ద 79kWh బ్యాటరీ ప్యాక్ అందుబాటులో ఉంటుంది. ఇంతకు ముందు ఈ పెద్ద బ్యాటరీ ప్యాక్ కేవలం ఈ రెండు ఎస్‌యూవీల టాప్ ప్యాక్ 3 వేరియంట్‌లకు మాత్రమే పరిమితం చేశారు. ఈ కొత్త నిర్ణయంతో టాప్-ఎండ్ ఫీచర్ల కంటే ఎక్కువ రేంజ్ కోరుకునే కస్టమర్‌లకు మహీంద్రా ప్రాధాన్యత ఇచ్చింది. దీనితో వినియోగదారులకు రూ.4 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది.

మహీంద్రా బీఈ 6, ఎక్స్‌ఈవీ 9ఈ ప్యాక్ 2 వేరియంట్‌లు ఇప్పుడు 79kWh బ్యాటరీతో లాంచ్ అయ్యాయి. ప్యాక్ 2 వేరియంట్‌లు ఇప్పుడు 59kWh, 79kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉన్నాయి. మహీంద్రా పెద్ద 79kWh బ్యాటరీ ప్యాక్‌తో కూడిన ప్యాక్ 2 వేరియంట్‌ల కోసం రూ.1.6 లక్షల ప్రీమియం ధరను వసూలు చేస్తోంది. అయితే, కస్టమర్‌లకు మరింత ఆనందం కలిగించే విషయం ఏమిటంటే.. బీఈ 6 ప్యాక్ 2 లాంగ్ రేంజ్ వేరియంట్ ఇప్పుడు టాప్ ప్యాక్ 3 వేరియంట్ కంటే రూ.3.4 లక్షలు తక్కువ ధరలో లభిస్తుంది. అదేవిధంగా, ఎక్స్‌ఈవీ 9ఈ ప్యాక్ 2 లాంగ్ రేంజ్ వేరియంట్ టాప్ ప్యాక్ 3 వేరియంట్ కంటే రూ.4 లక్షలు తక్కువ ధరలో అందుబాటులో ఉంది.

మహీంద్రా తన ఎలక్ట్రిక్ కార్లైన బీఈ 6, ఎక్స్‌ఈవీ 9ఈ మోడళ్ల ప్యాక్ 2 వేరియంట్‌లలో ఇప్పుడు రెండు బ్యాటరీ ఆప్షన్‌లను అందుబాటులోకి తెచ్చింది. అవి 59kWh మరియు పెద్ద 79kWh బ్యాటరీ ప్యాక్‌లు. 2025 మోడళ్లకు సంబంధించి బీఈ 6 79kWh వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.23.5 లక్షలు కాగా, 59kWh వేరియంట్ ధర రూ.21.9 లక్షలు. ఈ రెండింటి మధ్య రూ.1.6 లక్షల వ్యత్యాసం ఉంది. అదేవిధంగా, ఎక్స్‌ఈవీ 9ఈ 79kWh వేరియంట్ ధర రూ.26.5 లక్షలు, 59kWh వేరియంట్ ధర రూ.24.9 లక్షలు. ఈ మోడళ్ల మధ్య కూడా రూ.1.6 లక్షల వ్యత్యాసం కనిపిస్తోంది.

బీఈ 6 లాంగ్ రేంజ్ వేరియంట్ ఒకసారి ఛార్జ్ చేస్తే 683 కి.మీ. రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇది చిన్న 59kWh బ్యాటరీ ప్యాక్‌తో కూడిన వేరియంట్ కంటే 126 కి.మీ. ఎక్కువ. ఎక్స్‌ఈవీ 9ఈ లాంగ్ రేంజ్ వేరియంట్ ఒకసారి ఛార్జ్ చేస్తే 656 కి.మీ. రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇది చిన్న 59kWh బ్యాటరీ ప్యాక్‌తో కూడిన వేరియంట్ కంటే 114 కి.మీ. ఎక్కువ. ఈ రెండు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను లాంచ్ చేసినప్పటి నుండి, మహీంద్రా కేవలం టాప్ ప్యాక్ 3 వేరియంట్‌ల డెలివరీలను మాత్రమే ప్రారంభించింది. ఇప్పుడు మహీంద్రా ప్రకటించిన ప్రకారం.. ఎక్స్‌ఈవీ 9ఈ , బీఈ 6 రెండింటి మిడ్ ప్యాక్ 2 వేరియంట్‌ల డెలివరీలను జులై 2025 చివరి నుండి ప్రారంభించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories