Renault Triber: 7-సీటర్ మార్కెట్లో పెను సంచలనం.. త్వరలో మార్కెట్లోకి చౌకైన ఫ్యామిలీ కారు

Renault Triber
x

Renault Triber: 7-సీటర్ మార్కెట్లో పెను సంచలనం.. త్వరలో మార్కెట్లోకి చౌకైన ఫ్యామిలీ కారు

Highlights

Renault Triber: భారత మార్కెట్‌లో ఎన్నో రకాల వాహనాలు ఉన్నాయి. వీటిలో వినియోగదారులు తమ బడ్జెట్‌కు తగ్గ కారును ఎంచుకోవచ్చు. మీరు కూడా త్వరలో కొత్త కారు కొనే ప్లాన్‌లో ఉంటే కాస్త ఆగండి.

Renault Triber: భారత మార్కెట్‌లో ఎన్నో రకాల వాహనాలు ఉన్నాయి. వీటిలో వినియోగదారులు తమ బడ్జెట్‌కు తగ్గ కారును ఎంచుకోవచ్చు. మీరు కూడా త్వరలో కొత్త కారు కొనే ప్లాన్‌లో ఉంటే కాస్త ఆగండి. దేశంలోనే అత్యంత చవకైన 7-సీటర్ కారు రెనాల్ట్ ట్రైబర్ ఇప్పుడు కొత్త లుక్‌లో రాబోతోంది. రెనాల్ట్ ట్రైబర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.15 లక్షల నుండి ప్రారంభమై టాప్ మోడల్‌కు రూ.8.98 లక్షల వరకు ఉంటుంది. కాబట్టి, కొత్త మోడల్ ధర కూడా దీనికి అటుఇటుగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

కంపెనీ 2019లో ఈ కారును విడుదల చేసిన తర్వాత, ఇప్పుడు మొదటిసారిగా దీన్ని అప్‌డేట్ చేయబోతోంది. దీన్ని మొదటిసారి టెస్టింగ్ సమయంలో చూశారు. దీన్ని చెన్నై దగ్గర మళ్లీ గుర్తించారు. ఈసారి కంపెనీ దీని బయటి, లోపలి భాగాలలో పెద్ద మార్పులు చేయవచ్చు. ఈ ఫేస్‌లిఫ్ట్ కారు ఎక్స్ టీరియర్ విషయానికి వస్తే, ఇందులో చేంజ్ చేసిన హెడ్‌ల్యాంప్ క్లస్టర్, కొత్త ఐబ్రో లాంటి ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఇంటిగ్రేటెడ్ హెడ్‌ల్యాంప్స్ చూడవచ్చు. దీనితో పాటు, దీని ముందు గ్రిల్‌లో కూడా పెద్ద మార్పు ఉంటుంది. వెనుక భాగంలో కూడా మార్పులు కనిపిస్తాయి. ఇప్పటివరకు దీని ఇంటీరియర్ ఫోటోలు బయటకు రాలేదు. కానీ, మీడియా నివేదికల ప్రకారం.. ఇందులో చాలా కొత్త ఫీచర్లు లభించవచ్చు.

దీని డ్యాష్‌బోర్డ్‌లో కూడా చాలా మార్పులు చూడవచ్చు. లైట్ షేడ్స్‌తో పాటు ఇందులో సాఫ్ట్ టచ్ మెటీరియల్ ఎక్కువగా ఉండవచ్చు. ఇప్పుడు పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ ప్రస్తుతం 1.0 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ 3 సిలిండర్ పెట్రోల్ యూనిట్‌తో వస్తుంది. ఇది 72bhp పవర్, 96Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

రెనాల్ట్ ట్రైబర్ అతి పెద్ద ప్రత్యేకత దాని 7-సీటర్ లేఅవుట్. ఇది ఈ ఫేస్‌లిఫ్ట్‌లో కూడా కొనసాగుతుంది. ఇప్పుడు మూడవ వరుసలోని మధ్య సీటులో కూడా హెడ్‌రెస్ట్ లభిస్తుంది, దీనివల్ల అందులో కూర్చునే వారికి మరింత సౌకర్యం కలుగుతుంది. కంపెనీ కొద్దికాలం క్రితం ట్రైబర్ సీఎన్‌జీ వెర్షన్‌ను కూడా విడుదల చేసింది.

భారతదేశంలో పెద్ద, మరింత ఉపయోగకరమైన కార్లకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ట్రైబర్ ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్, మారుతి స్విఫ్ట్, హ్యుందాయ్ ఐ20 వంటి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లు, టిగోర్, డిజైర్ వంటి కాంపాక్ట్ సెడాన్‌ల మధ్య విశాలమైన, బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్ కోరుకునే వినియోగదారులకు బెస్ట్ ఛాయిస్ కావొచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories