
Renault Duster
Renault : మార్చి 17న రెనాల్ట్ కొత్త డస్టర్ లాంచ్ కానుంది. అలాగే మార్చి 10న బ్రిజర్ కాన్సెప్ట్ ఎస్‌యూవీని కంపెనీ ఆవిష్కరించనుంది. ఈ రెండు మోడల్స్ భారత ఆటోమొబైల్ రంగంలో భారీ అంచనాలు రేపుతున్నాయి.
Renault : ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ భారత మార్కెట్లో తన పట్టును పెంచుకునేందుకు దూకుడుగా అడుగులు వేస్తోంది. రాబోయే ఐదేళ్లలో 3 నుంచి 5 శాతం మార్కెట్ వాటాను దక్కించుకోవడమే లక్ష్యంగా సరికొత్త ప్రొడక్ట్ స్ట్రాటజీని ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రతి ఏటా ఒక కొత్త మోడల్‌ను లాంచ్ చేయాలని నిర్ణయించింది. ఈ ప్రయాణం 2026లో థర్డ్ జనరేషన్ డస్టర్ లాంచ్‌తో ఘనంగా ప్రారంభం కానుంది.
మార్చి 17న కొత్త డస్టర్ రాక
భారతీయులకు అత్యంత ఇష్టమైన ఎస్‌యూవీలలో ఒకటైన రెనాల్ట్ డస్టర్, సరికొత్త అవతారంలో మార్చి 17, 2026న గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. మోడరన్ డిజైన్, ప్రీమియం ఇంటీరియర్స్, మరింత పవర్ఫుల్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్లతో ఇది రానుంది. ప్రారంభంలో 1.3 లీటర్ టర్బో (163 bhp), 1.0 లీటర్ టర్బో (100 bhp) ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా ఉండగా, 1.3 లీటర్ వేరియంట్లో 6-స్పీడ్ DCT ఆటోమేటిక్ ఆప్షన్ కూడా ఉంటుంది. అంతేకాదు, 2026 దీపావళి నాటికి 1.8 లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ ఇంజిన్‌తో డస్టర్ హైబ్రిడ్ కూడా మార్కెట్లోకి రానుంది.
సంచలనం రేపుతున్న బ్రిజర్ కాన్సెప్ట్
డస్టర్‌తో పాటు రెనాల్ట్ నుంచి వస్తున్న మరో క్రేజీ మోడల్ బ్రిజర్. మార్చి 10న ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం చేయనున్న ఈ కాన్సెప్ట్ ఎస్యూవీ టీజర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 4 మీటర్ల కంటే తక్కువ పొడవు ఉండే ఈ అర్బన్ ఎస్‌యూవీని పూర్తిగా భారత్‌లోనే డిజైన్ చేసి అభివృద్ధి చేయడం విశేషం. ఇది చూడటానికి ల్యాండ్ రోవర్ డిఫెండర్‌ను పోలి ఉన్నట్లు కనిపిస్తోంది. టెయిల్ గేట్‌పై స్పేర్ వీల్, నిటారుగా ఉండే సిల్హౌట్ దీనికి రఫ్ అండ్ టఫ్ లుక్‌ను ఇస్తున్నాయి.
థార్, జిమ్నీలకు గట్టి పోటీ
రెనాల్ట్ బ్రిజర్ మార్కెట్లోకి వస్తే మహీంద్రా థార్ (3-డోర్), మారుతి జిమ్నీలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇందులో కిగర్ నుంచి సేకరించిన 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను వాడే అవకాశం ఉంది. స్పేస్ విషయంలో రాజీ లేకుండా, సిటీ రోడ్లపై, ఆఫ్-రోడ్ అడ్వెంచర్లకు పనికొచ్చేలా దీనిని రూపొందిస్తున్నారు. రాబోయే 10 రోజుల్లో రెనాల్ట్ డస్టర్, బ్రిజర్ గురించిన మరిన్ని ఆసక్తికరమైన వివరాలు బయటకు రానున్నాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




