Scrapage Policy: కాలం చెల్లిన వాహనాలన్నీ ఎక్కడకు వెళుతున్నాయి? ఏ టెక్నాలజీని ఉపయోగించి వీటిని స్క్రాపింగ్ చేస్తారు?

Scrapage policy
x

Scrapage policy: కాలం చెల్లిన వాహనాలన్నీ ఎక్కడకు వెళుతున్నాయి? ఏ టెక్నాలజీని ఉపయోగించి వీటిని స్క్రాపింగ్ చేస్తారు?

Highlights

Scrapage Policy: దేశంలో వాహనాల వాడకం ఈ మధ్య బాగా పెరిగిపోయింది. ఒక ఇంటికి రెండు కార్లు ఇప్పుడు కామన్ అయిపోయింది. కొన్ని ఇళ్లలో 3 లేదా 4. మరైతే ఈ దేశంలో ఎన్నికార్లు ఉండి ఉంటాయి.

Scrapage policy: దేశంలో వాహనాల వాడకం ఈ మధ్య బాగా పెరిగిపోయింది. ఒక ఇంటికి రెండు కార్లు ఇప్పుడు కామన్ అయిపోయింది. కొన్ని ఇళ్లలో 3 లేదా 4. మరైతే ఈ దేశంలో ఎన్నికార్లు ఉండి ఉంటాయి. అసలు కాలం చెల్లిన కార్లన్నీ ఎక్కడకు వెళతాయి. వాటిని ఎలా స్ర్పాంపింగ్‌ చేస్తారు? అంటే స్ర్కాపింగ్ కోసం ఒక సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తారు. దీంతో గంటలో కొన్ని వందల కార్ల స్క్రాపింగ్ అయిపోతుంటాయి. ఆ వివారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

దేశంలో కాలుష్యం పెరిగిపోతుంది. దీంతో కాలం చెల్లిన అంటే 15సంవత్సరాలు దాటిన కార్లను షెడ్డులకు పంపుతుంటారు. అంతేకాదు.. బస్సులు, లారీలు, వ్యానులు, జీపులు.. ఇలాంటి ఎన్నో రకాల వాహనాలు కూడా రోడ్డుపై తిరుగుతుంటాయి. ఇందులో పాడైన అలాగే కాలం చెల్లిన కార్లన్నీ కూడా షెడ్డులకే వెళుతుంటాయి. ఇలా షెడ్డులకు వెళ్లిన కార్ల పరిస్థితి ఏంటి? ఇలా రోజుకు వందలు లేదా వేల సంఖ్యలో షెడ్‌లకు కార్లు వెళ్లే సంఖ్య ఉండొచ్చు. మరి అలాంటిది షెడ్డులు వాటికోసం సరిపోతున్నాయా? అందుకే స్క్రాపింగ్‌ ప్రాసెస్ చేసి కార్లను తగ్గిస్తారు. అదెలాగో చూద్దాం.

సాధారణంగా ఇలా షెడ్డులకు వెళ్లిన పాడైన, కాలం చెల్లిన వాహనాలన్నీ చివరగా హర్యానాలోని మనేసర్‌‌ దగ్గరలో ఉన్న అభిషేక్ కెకైహూ రీస్లైక్లర్స్ ప్రయివేటు లిమిటెడ్‌కు చేరతాయి. ప్రభుత్వం కొత్త ప్రేమ్ వర్క్ కింద ఆ రాష్ట్రంలో రిజిస్టర్ అయిన మొట్టమొదటి రిజిస్టర్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ అని చెప్పొచ్చు. దేశంలో కాలుష్యం పెరగకూడదనే కారణంతో 15 ఏళ్లు నిండిన వాహనాలన్నింటినీ కూడా తప్పనిసరిగా స్కాప్ చేయాలని భారత ప్రభుత్వం ఆదేశించింది. అందుకే అభిషేక్ కెకైహూలో టెక్నాలజీ పరంగా స్క్రాపింగ్ జరుగుతుంది.

ఎన్ని వాహనాలు స్క్రాప్ అవుతాయి?

అభిషేక్ కెకైహు స్క్రాపింగ్ కేంద్రంలో ఏటా దాదాపు 24 వేల నుంచి 25 వేల వరకు కాలం చెల్లిన వాహనాలను స్కాప్‌గా మారుస్తారు. దీనికోసం జపనీస్ కంపెనీ సహకారాన్ని తీసుకుంటారు. ఇక్కడ అన్ని రకాల టూవీలర్స్, ఫోర్ వీలర్స్, బస్సులు, లారీలు, ట్రక్కులు ఇలా అన్నీ అక్కడకు చేరుకుంటాయి.

స్కాపింగ్ ఎలా చేస్తారు?

ముందుగా వాహనాలన్నింటినీ పరిశీలించి, అందులో ఇనుము, అల్యూమినియం భాగాలను వేరు చేస్తారు. మిగిలిన బాడీని కటింగ్‌ కోసం పంపుతారు. అయితే ఇక్కడ గ్యాస్ కట్టర్లను వాడరు. ప్లాస్మా కట్టర్లనే ఎక్కువగా వాడతారు. ఇలా కట్ చేసిన బాడీని బేలింగ్ మెషీన్‌లో ప్రాసెస్ చేస్తారు. దీంతో కొత్త వాహన భాగాలను తయారు చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు.

స్కాపింగ్‌కు ఎంత సమయం పడుతుంది?

వాహనాలను స్క్రాపింగ్ చేయడం అనేది ఒక పెద్ద ప్రాసెస్. కేవలం 80 నిమిషాల నుంచి 100 నిమిషాల్లోపు వాహనం స్క్రాపింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. జపనీస్ టెక్నాలజీ మెషీన్లలో ఉండటం వల్లే ఈ ప్రాసెస్ ఇంత త్వరగా జరుగుతుంది. వాహనం స్క్రాపింగ్ తర్వాత వాహనదారులు ఒక సర్టిఫికేట్‌ను కూడా పొందుతారు. ప్రస్తుతం 20 రాష్ట్రాలు, కేంద్ర పాలితన ప్రాంతాల్లో 99 రిజిస్టర్ వెహికల్ స్క్రాపింగ్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటి ద్వారా చూస్తే ఇప్పటివరకు అభిషేక్ కెకైహూ రీస్లైక్లర్స్ ప్రయివేటు లిమిటెడ్‌లో దాదాపు 1.18 లక్షల ప్రభుత్వ వాహనాలు అలాగే 1.27 లక్షల ప్రయివేట్ వాహనాలను స్క్రాప్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories