Car Offers: ఆ టాటా కార్లపై ఆఫర్ల జాతర.. ఏకంగా రూ.75 వేల వరకు డిస్కౌంట్స్..!

Car Offers
x

Car Offers: ఆ టాటా కార్లపై ఆఫర్ల జాతర.. ఏకంగా రూ.75 వేల వరకు డిస్కౌంట్స్..!

Highlights

Car Offers: మహీంద్రా XUV 700 కొనుగోలు చేయడానికి ఇది గొప్ప నెల. కంపెనీ తన పెట్రోల్, డీజిల్ వేరియంట్‌ల ధరలను రూ.45,000 నుండి రూ.75,000 వరకు తగ్గించింది.

Car Offers: మహీంద్రా XUV 700 కొనుగోలు చేయడానికి ఇది గొప్ప నెల. కంపెనీ తన పెట్రోల్, డీజిల్ వేరియంట్‌ల ధరలను రూ.45,000 నుండి రూ.75,000 వరకు తగ్గించింది. ఏప్రిల్ 1 నుండి ధరలు పెరుగుతాయి కాబట్టి మీరు మార్చి 31 వరకు ఈ తగ్గింపును పొందచ్చు. ఈ కారుపై డబ్బు ఆదా చేయడానికి ఇదే సరైన అవకాశం. XUV 700లో పెట్రోల్, డీజిల్ ఆప్షన్లు ఉన్నాయి. మహీంద్రా XUV700 టర్బో-పెట్రోల్ ,డీజిల్ వేరియంట్‌లపై ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో హై-స్పెక్ AX7, AX7 L ట్రిమ్‌లు ఉన్నాయి.

Mahindra XUV 700

మహీంద్రా XUV700లో చాలా మంచి ఫీచర్లను చూడచ్చు. ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) మరియు 360 డిగ్రీల కెమెరా భద్రతా ఫీచర్‌లుగా అందించబడ్డాయి. ఇది లెవెల్-2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్-అసిస్టెంట్ సిస్టమ్స్ (ADAS) సెట్‌ను కూడా పొందుతుంది, ఇందులో లేన్-కీపింగ్ అసిస్ట్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇది కాకుండా, ఇది 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, 6-వే పవర్డ్ డ్రైవర్ సీట్, పనోరమిక్ సన్‌రూఫ్, 12-స్పీకర్ సౌండ్ సిస్టమ్, డ్యూయల్-జోన్ ఆటో ఏసీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 6-వే ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు వంటి ఫీచర్లు ఉన్నాయి.

Mahindra XUV 700 Features

ఈ నెల టాటా మోటార్స్ తన వాహనాలపై రూ.75,000 వరకు తగ్గింపును ఆఫర్ చేసింది. టాటా హారియర్, సఫారీపై రూ.75,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. కొంతమంది టాటా డీలర్‌ల వద్ద ఇప్పటికే సఫారి, హారియర్ పాత స్టాక్ (MY2024) మిగిలి ఉంది. దానిని క్లియర్ చేయడానికి డిస్కౌంట్ ఇస్తున్నట్లు సమాచారం. 2025 మోడల్‌పై రూ. 50,000 వరకు తగ్గింపును అందిస్తోంది.

Tata Car Offers

ఈ తగ్గింపులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్‌ఛేంజ్, స్క్రాపేజ్ బోనస్ ఉన్నాయి. అంతే కాకుండా టియాగోపై రూ. 45,000 వరకు తగ్గింపు లభిస్తుంది, అయితే ఆల్ట్రోజ్‌పై రూ. 1.35 లక్షల వరకు ఆదా చేసే అవకాశం ఉంది. అలానే టాటా కర్వ్‌పై రూ. 30,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ తగ్గింపులు ప్రస్తుతం 2024 మోడల్స్‌పై ఉన్నాయి. ఆఫర్‌లపై మరిన్ని వివరాల కోసం టాటా డీలర్‌లను సంప్రదించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories