Tata Harrier EV: టాటా నుంచి అద్భుతమైన ఎలక్ట్రీక్‌ కారు.. సింగిల్ ఛార్జ్‌తో 500 కిమీ..!

Tata Harrier EV
x

Tata Harrier EV: టాటా నుంచి అద్భుతమైన ఎలక్ట్రీక్‌ కారు.. సింగిల్ ఛార్జ్‌తో 500 కిమీ..!

Highlights

Tata Harrier EV: టాటా హారియర్ ఈవీ అతి త్వరలో విడుదల కానుంది. జనవరిలో ఘనంగా ముగిసిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కూడా ఈ కారును ప్రదర్శించారు. ఇందులో అనేక్ అప్‌డేటెడ్ ఫీచర్లు కనిపిస్తాయి.

Tata Harrier EV: టాటా హారియర్ ఈవీ అతి త్వరలో విడుదల కానుంది. జనవరిలో ఘనంగా ముగిసిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కూడా ఈ కారును ప్రదర్శించారు. ఇందులో అనేక్ అప్‌డేటెడ్ ఫీచర్లు కనిపిస్తాయి. అయితే దీని ధర కొంచెం ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. దీని ధర రూ.30 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉండొచ్చిని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టాటా హారియర్ ఈవీ డిజైన్‌లో చాలా పెద్ద మార్పులు చేసింది. హారియర్ ఎలక్ట్రిక్ కారు స్పై వీడియోలు/ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. హారియర్ ఈవీలో క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్, వర్టికల్ స్లాట్‌లు, రీ-డిజైన్ చేసిన బంపర్, అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. 75 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను పొందే అవకాశం ఉంది. పూర్తి ఛార్జ్‌తో 500 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని అంచనా. దీనితో పాటు, డ్యూయల్-మోటార్ సెటప్ , ఆల్-వీల్ డ్రైవ్ టెక్నాలజీని కూడా చేర్చే అవకాశం ఉంది.

టాటా హారియర్ ఈవీలో 5 సీట్లు ఉన్నాయి, కాబట్టి ప్రయాణికులు సులభంగా కూర్చోవచ్చు. ఇతర ఫీచర్లలో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ ఏసీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారు గరిష్ట భద్రతా లక్షణాలను పొందగలదని భావిస్తున్నారు.

ఏడు ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్-డీసెంట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా అందుబాటులో ఉన్నాయి. కారు ధర రూ.30 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుందని చెబుతున్నారు. కొత్త హారియర్ ఎలక్ట్రిక్ కారు హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మారుతి సుజుకి ఈ విటారా వంటి వాటికి గట్టి పోటీనిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories