Tata Harrier EV: ఉత్పత్తి ప్రారంభం.. డెలివరీలు జూలైలోనే! ధర ఎంతంటే?

Tata Harrier EV: ఉత్పత్తి ప్రారంభం.. డెలివరీలు జూలైలోనే! ధర ఎంతంటే?
x

Tata Harrier EV: ఉత్పత్తి ప్రారంభం.. డెలివరీలు జూలైలోనే! ధర ఎంతంటే?

Highlights

టాటా మోటార్స్ అధికారికంగా తమ నూతన ఎలక్ట్రిక్ SUV హారియర్ EV ఉత్పత్తిని ప్రారంభించినట్లు ప్రకటించింది.

టాటా మోటార్స్ అధికారికంగా తమ నూతన ఎలక్ట్రిక్ SUV హారియర్ EV ఉత్పత్తిని ప్రారంభించినట్లు ప్రకటించింది. కంపెనీ పుణేలోని తన ప్లాంట్‌లో ఈవీ మోడల్ ప్రొడక్షన్‌ మొదలైనట్లు తెలిపింది. కార్ల డెలివరీలు ఈ నెల చివర్లో అంటే 2025 జులైలోనే ప్రారంభం కానున్నాయి.

జూన్ 27న హారియర్ EV ధరలను ప్రకటించిన తర్వాత జూలై 2న టాటా బుకింగ్‌లను అధికారికంగా ప్రారంభించింది. ఈ కారుకు భారత NCAP 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించగా, పెద్దల భద్రతలో 32/32, పిల్లల భద్రతలో 45/49 మార్కులతో అద్భుత ప్రదర్శన ఇచ్చింది.

ఈ ఎలక్ట్రిక్ SUV రెండు బ్యాటరీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది – 65 కిలోవాట్లు మరియు 75 కిలోవాట్లు. రెండు వేరియంట్‌లలో రియర్ వీల్ డ్రైవ్ (RWD) సెటప్ లభిస్తుండగా, 75 కిలోవాట్ల వేరియంట్‌లో డ్యూయల్ మోటార్‌తో ఆల్ వీల్ డ్రైవ్ (AWD) సదుపాయమూ ఉంటుంది. ధరలు రూ. 21.49 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై, టాప్ వేరియంట్‌కి రూ. 28.99 లక్షల వరకు ఉన్నాయి.

ఈ హారియర్ EV టాటా మోటార్స్ విస్తరిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిలో మరో కీలక అడుగు. బలమైన ప్రదర్శన, అత్యాధునిక టెక్నాలజీ, అత్యధిక భద్రతా ప్రమాణాలతో మార్కెట్‌ను ఆకర్షించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories