Tesla India Entry: రేపు గ్రాండ్ ఎంట్రీ.. ముంబైలో షోరూమ్ ఓపెనింగ్! మోడల్ Y ధర ఎంతంటే?

Tesla India Entry: రేపు గ్రాండ్ ఎంట్రీ.. ముంబైలో షోరూమ్ ఓపెనింగ్! మోడల్ Y ధర ఎంతంటే?
x

Tesla India Entry: రేపు గ్రాండ్ ఎంట్రీ.. ముంబైలో షోరూమ్ ఓపెనింగ్! మోడల్ Y ధర ఎంతంటే?

Highlights

ఇన్నాళ్ల ఉత్కంఠకు తెరదిస్తూ టెస్లా ఎలక్ట్రిక్ కార్ల రంగంలో భారతదేశంలోకి అధికారికంగా అడుగుపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఈ కంపెనీ రేపు, అంటే జూలై 15న ముంబైలో తన తొలి షోరూమ్‌ను ప్రారంభించనుంది

ఇన్నాళ్ల ఉత్కంఠకు తెరదిస్తూ టెస్లా ఎలక్ట్రిక్ కార్ల రంగంలో భారతదేశంలోకి అధికారికంగా అడుగుపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఈ కంపెనీ రేపు, అంటే జూలై 15న ముంబైలో తన తొలి షోరూమ్‌ను ప్రారంభించనుంది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ప్రారంభమయ్యే ఈ షోరూమ్‌తో భారత్‌లో టెస్లా ప్రయాణం మొదలవనుంది. ఎలాన్ మస్క్ స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరవుతారా, లేక వీడియో సందేశం ఇస్తారా అనే ఆసక్తికర చర్చ ఇప్పుడు నడుస్తోంది.

మొదటిది షోరూమ్ మాత్రమే కాదు. ఇది టెస్లా భారత మార్కెట్‌పై పెట్టుకున్న నమ్మకానికి నిదర్శనం. గతంలో కంపెనీ ఇక్కడ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని చూసినప్పటికీ, అది అడ్డంకులకు తాళలేక నిలిచిపోయింది. అయితే ఇప్పుడు ఎట్టకేలకు షోరూమ్‌తో ఒక దశను ప్రారంభిస్తోంది. గత కొన్ని నెలలుగా షాంఘై నుంచి దిగుమతి చేసిన మోడల్ Y కార్లు, విడిభాగాలు, చార్జర్లు దేశంలోకి వచ్చాయి. రేపటి ప్రారంభోత్సవానికి ఆరు మోడల్ Y కార్లు షోరూమ్‌లో డిస్‌ప్లే చేయబోతున్నారు. ఇక సర్వీస్ సెంటర్ కూడా అదే ప్రాంగణంలోనే ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

టెస్లా ప్రయాణం ఇది తొలిసారి కాదు. 2016 నుంచే ఈ బ్రాండ్ భారతదేశంపై కన్నేసి ఉంది. అప్పట్లోనే మోడల్ 3 కోసం కొన్ని బుకింగ్స్‌ తీసుకున్నా, వాటిని వెనక్కి తీసుకుంది. కారణం—భారతదేశంలోని అధిక దిగుమతి ట్యాక్స్‌లు. దాదాపు 70 శాతం వరకు ఉన్న ఈ పన్నుల భారంతో కంపెనీ ఇక్కడ తయారీ ఏర్పాటు చేయాలని ముందుకు రాలేకపోయింది. మస్క్ పలు మార్లు భారత ప్రభుత్వం ముందు పన్నుల తగ్గింపును కోరారు. అప్పట్లో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇప్పుడు టెస్లా, తయారీ కాకుండా దిగుమతుల ద్వారానే మార్కెట్‌ను టార్గెట్ చేయాలని నిర్ణయించింది. మొదటగా మోడల్ Y SUVను భారత్‌కు తీసుకొస్తోంది. దీని ధర సుమారు రూ.60 నుంచి 70 లక్షల మధ్య ఉండే అవకాశముంది. ఇందులో అధునాతన ఫీచర్లు, 500 కి.మీ. రేంజ్, పెద్ద టచ్‌స్క్రీన్, ఆటోపైలట్ వంటి టెక్నాలజీలు అందుబాటులో ఉండనున్నాయి. బ్రాండ్ విలువ, టెక్నాలజీ పనితీరు వల్ల లగ్జరీ కస్టమర్లు టెస్లా వైపు ఆకర్షితులయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

టెస్లా ఎంట్రీతో భారత EV రంగంలో పోటీ మరింత వేడెక్కనుంది. ఇప్పటికే టాటా, మహీంద్రా, BYD, కియా వంటి కంపెనీలు ఈ రంగంలో తమదైన స్థానం ఏర్పరుచుకున్నాయి. అయితే టెస్లా వచ్చి పోటీని మరో లెవెల్‌కు తీసుకెళ్తుందని పరిశ్రమలో ఊహాగానాలు ఉన్నాయి. టెస్లాకు చైనా కంపెనీ BYD నుండి గట్టి పోటీ ఎదురవుతోంది. తక్కువ ధరలో మెరుగైన ఫీచర్లతో BYD చైనాలో మార్కెట్ షేర్‌ను దక్కించుకుంది. టెస్లా వాటా తగ్గిపోయిన నేపథ్యంలో, ఇండియా వంటి పెద్ద మార్కెట్‌ను పునఃస్థాపనకు టెస్లా ముఖ్యంగా భావిస్తోంది.

ముంబై తర్వాత ఢిల్లీ, బెంగళూరులో కూడా టెస్లా ఎక్స్‌పీరియెన్స్ సెంటర్లను ప్రారంభించాలన్న యోచనలో ఉంది. ఇప్పటికే ఢిల్లీలో కొన్ని షోరూమ్ భాగస్వాముల నుంచి అప్లికేషన్లు తీసుకున్నట్లు సమాచారం.

రేపటితో భారతదేశం మరో అంతర్జాతీయ దిగ్గజ బ్రాండ్‌ను స్వాగతించబోతోంది. ఇది దేశంలోని EV ప్రొసెస్‌ను ఎంతగా వేగవంతం చేస్తుందో చూడాలి మరి.



Show Full Article
Print Article
Next Story
More Stories