Toyota Innova Hycross: హిస్టరీ క్రియేట్ చేసిన ఇన్నోవా హైక్రాస్..దేశంలో తొలి 5-స్టార్ సేఫ్టీ MPV!

Toyota Innova Hycross
x

Toyota Innova Hycross: హిస్టరీ క్రియేట్ చేసిన ఇన్నోవా హైక్రాస్..దేశంలో తొలి 5-స్టార్ సేఫ్టీ MPV!

Highlights

Toyota Innova Hycross: టయోటా ఇన్నోవా హైక్రాస్ కు భారతదేశ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది.

Toyota Innova Hycross: టయోటా ఇన్నోవా హైక్రాస్ కు భారతదేశ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. దీంతో ఇది BNCAP నుంచి 5-స్టార్ రేటింగ్ పొందిన భారతదేశపు మొట్టమొదటి MPVగా చరిత్ర సృష్టించింది. అంతేకాదు, ఇండియన్ సేఫ్టీ ఎవాల్యుయేషన్ ప్రోగ్రామ్ కింద టెస్ట్ చేయబడిన టయోటా మొదటి కారు కూడా ఇదే. టయోటా ఇన్నోవా హైక్రాస్ భారత మార్కెట్‌లో ఇప్పటికే ఒక ప్రముఖ హైబ్రిడ్ MPV గా పేరు గాంచింది. ఈ కారు దాని ప్రీమియం ఇంటీరియర్, అద్భుతమైన మైలేజ్ కారణంగా చాలా పాపులారిటీ సంపాదించుకుంది.

ఇప్పుడు ఈ కారు సేఫ్టీలో కూడా తన సత్తాను చాటింది. క్రాష్ టెస్ట్ స్కోర్‌ల విషయానికి వస్తే, ఇన్నోవా హైక్రాస్ అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ లో 32కి 30.47 పాయింట్లు, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ లో 49కి 45.00 పాయింట్లు సాధించింది. ఈ స్కోర్‌ల ఆధారంగా BNCAP దీనికి ఫైవ్-స్టార్ రేటింగ్ ఇచ్చింది. ధర విషయానికి వస్తే ఇన్నోవా హైక్రాస్ ఎక్స్-షోరూమ్ ధర రూ.19.94 లక్షల నుంచి ప్రారంభమై రూ.31.34 లక్షల వరకు ఉంటుంది. ఈ ధర దాని వేరియంట్‌లు, సీటింగ్ కాన్ఫిగరేషన్ (7 లేదా 8-సీటర్) బట్టి మారుతుంది. దీని 7-సీటర్ హైబ్రిడ్ వేరియంట్ ధర రూ.26.31 లక్షల వరకు ఉంటుంది.

ఇంజిన్, మైలేజ్ విషయానికి వస్తే ఈ MPVలో 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఒక హైబ్రిడ్ (ఎలక్ట్రిక్ + పెట్రోల్) సిస్టమ్ ఆప్షన్ కూడా లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్ మైలేజ్ లీటరుకు 16.13 కిమీ, అయితే హైబ్రిడ్ వేరియంట్ లీటరుకు 23.24 కిమీ వరకు మైలేజ్ ఇవ్వగలదు. దీని ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 52 లీటర్లు, ఇది హైబ్రిడ్ వెర్షన్‌తో దాదాపు 1200 కిమీ వరకు ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది.

సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, ఇన్నోవా హైక్రాస్‌లో అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. అంతేకాకుండా, ఇందులో ప్రీ-కొలిజన్ సిస్టమ్, బ్లైండ్ స్పాట్ మానిటర్, లేన్ ట్రేస్ అసిస్ట్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, SOS E-call, ఆటో హై బీమ్, ABS, EBD, ISOFIX మౌంట్స్ వంటి ఆధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులో 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ డిస్‌ప్లే, 300 లీటర్ బూట్ స్పేస్, మల్టిపుల్ సీటింగ్ కాన్ఫిగరేషన్లు లభిస్తాయి. ఇప్పుడు ఇన్నోవా హైక్రాస్‌కు 5-స్టార్ BNCAP సేఫ్టీ రేటింగ్ లభించడంతో దాని అమ్మకాలు కూడా గణనీయంగా పెరుగుతాయని భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories