Triumph : కొత్తగా లాంచ్ అయిన ట్రయంఫ్ బైక్.. దీని ఇంజిన్ ముందు కార్లు కూడా దిగదుడుపే!

Triumph
x

Triumph : కొత్తగా లాంచ్ అయిన ట్రయంఫ్ బైక్.. దీని ఇంజిన్ ముందు కార్లు కూడా దిగదుడుపే!

Highlights

Triumph: ప్రముఖ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ ట్రయంఫ్ భారత మార్కెట్లో తన కొత్త మోడల్ 2025 స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్ఎస్ ను లాంచ్ చేసింది. ఈ బైక్ ధర ఎక్స్-షోరూమ్ ధర రూ.20.39 లక్షలు.

Triumph: ప్రముఖ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ ట్రయంఫ్ భారత మార్కెట్లో తన కొత్త మోడల్ 2025 స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్ఎస్ ను లాంచ్ చేసింది. ఈ బైక్ ధర ఎక్స్-షోరూమ్ ధర రూ.20.39 లక్షలు. పాత మోడల్‌తో పోలిస్తే దీని ధర రూ.2.44 లక్షలు ఎక్కువగా ఉంది. ఈ కొత్త మోడల్‌లో అడ్వాన్సుడ్ టెక్నికల్ ఫీచర్లు, పవర్ ఫుల్ ఇంజిన్ ఉన్నాయి. ఇవి సాధారణ కార్ల ఇంజిన్‌లను కూడా మించిపోయాయి. కొత్త 2025 ట్రయంఫ్ స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్ఎస్ లో 1160సీసీ, 3-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 183బీహెచ్‌పి పవర్, 128ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది పాత మోడల్ కంటే 3బీహెచ్‌పి ఎక్కువ పవర్, 3ఎన్ఎమ్ ఎక్కువ టార్క్‌ను ఇస్తుంది. ఈ ఎక్స్ ట్రా పవర్ కు కారణం కొత్త ఫ్రీ-ఫ్లోయింగ్ ఎగ్జాస్ట్ సిస్టమ్ అని కంపెనీ తెలిపింది. ఈ ఇంజిన్ చాలా పవర్ ఫుల్

ఈ కొత్త మోటార్‌సైకిల్‌లో అత్యంత ముఖ్యమైన మార్పు ఓహ్లిన్స్ ఈసీ 3.0 ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ సిస్టమ్‌. ఇది రైడర్‌కు మంచి కంట్రోల్ ఇస్తుంది. రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా సస్పెన్షన్ సెట్టింగ్స్‌ను మార్చుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది. అలాగే, కొత్త స్పీడ్ ట్రిపుల్ బైక్‌కు ముందు వైపు 120/70-జెడ్ఆర్17, వెనుక వైపు 190/55-జెడ్ఆర్17 కొలతలతో కూడిన పిరెల్లి సూపర్ కోర్సా వి3 టైర్లు ఉన్నాయి.

2025 మోడల్ లో స్టాండర్డ్ స్టీరింగ్ డ్యాంపర్, తేలికపాటి వీల్స్ కూడా ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ సిస్టమ్‌ను కూడా అప్‌గ్రేడ్ చేశారు. ఇప్పుడు వీలీ కంట్రోల్ సిస్టమ్ ను ట్రాక్షన్ కంట్రోల్ నుంచి విడిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ధర పెరిగినప్పటికీ, ఇది భారతదేశంలో ఇప్పటికీ అత్యంత చౌకైన యూరోపియన్ సూపర్ నేకెడ్ బైక్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ బైక్ మూడు రంగుల్లో అందుబాటులో ఉంది: జెట్ బ్లాక్, గ్రానైట్/డియాబ్లో రెడ్, గ్రానైట్/ట్రయంఫ్ పర్ఫార్మెన్స్ యెల్లో.

Show Full Article
Print Article
Next Story
More Stories