Apache RTR 310 : కేటీఎం, బీఎండబ్ల్యూలకు గట్టి పోటీ.. మార్కెట్లోకి టీవీఎస్ నయా బైక్

Apache RTR 310 : కేటీఎం, బీఎండబ్ల్యూలకు గట్టి పోటీ.. మార్కెట్లోకి టీవీఎస్ నయా బైక్
x
Highlights

Apache RTR 310: బైక్ లవర్స్స కు గుడ్ న్యూస్. టీవీఎస్ మోటార్ కంపెనీ తన కొత్త Apache RTR 310ని అద్భుతమైన ఫీచర్లతో లాంచ్ చేసింది.

Apache RTR 310: బైక్ లవర్స్స కు గుడ్ న్యూస్. టీవీఎస్ మోటార్ కంపెనీ తన కొత్త Apache RTR 310ని అద్భుతమైన ఫీచర్లతో లాంచ్ చేసింది. సూపర్ బైక్ తరహా స్వ్యాగ్‌తో, లాంచ్ కంట్రోల్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లతో వచ్చిన ఈ బైక్ కేటీఎం, బీఎండబ్ల్యూ వంటి ప్రీమియం బైక్‌లకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. టీవీఎస్ మోటార్ కంపెనీ ఇటీవల 2025 Apache RTR 310 BS VI మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 2.39 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త మోడల్‌లో కొన్ని చిన్నపాటి మార్పులు చేశారు. ముఖ్యంగా ఫ్యూయల్ ట్యాంక్‌పై కొత్త గ్రాఫిక్స్ చూడొచ్చు.

అపాచీ ఆర్టీఆర్ 310 ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో 312.12 సీసీ, సింగిల్-సిలిండర్, రివర్స్-ఇన్‌క్లైన్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది స్పోర్ట్, ట్రాక్, సూపర్‌మోటో మోడ్‌లలో 9700 ఆర్‌పిఎమ్ వద్ద 35.1 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. అర్బన్, రెయిన్ మోడ్‌లలో ఇది 26.7 బిహెచ్‌పి పవర్‌ను అందిస్తుంది. టార్క్ విషయంలో పర్ఫార్మెన్స్ సెట్టింగ్స్‌లో 28.7 ఎన్ఎమ్ టార్క్ లభిస్తుంది. ఈ బైక్‌లో హైబ్రిడ్ ట్రాలీస్, అల్యూమినియం కాస్ట్ ఫ్రేమ్, 41 mm అడ్జస్టబుల్ USD ఫోర్కులు, వెనుక మోనోషాక్, మిచెలిన్ రోడ్ 5 టైర్లు వంటివి ఉన్నాయి. ఇవి బైక్‌కు అద్భుతమైన రైడింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తాయి.

అపాచీ ఆర్టీఆర్ 310 బేస్ వేరియంట్‌లో కూడా క్రూయిజ్ కంట్రోల్, లీనియర్ ట్రాక్షన్ కంట్రోల్, డ్రాగ్ టార్క్ కంట్రోల్, రియర్ వీల్ లిఫ్ట్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక టాప్ వేరియంట్‌లో అయితే బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ కూడా ఉంది. ఇది ఈ ధరలో చాలా అరుదుగా లభిస్తుంది. డైనమిక్ కిట్‌లో అడ్జస్టబుల్ ఫ్రంట్ మరియు రియర్ సస్పెన్షన్, బ్రాస్-కోటెడ్ డ్రైవ్ చైన్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటివి ఉన్నాయి.

మరిన్ని ఫీచర్ల విషయానికి వస్తే, డైనమిక్ ప్రో కిట్, కీ-లెస్ రైడ్, లాంచ్ కంట్రోల్, కార్నరింగ్ ఏబీఎస్, కార్నరింగ్ క్రూయిజ్ కంట్రోల్, స్లోప్-డిపెండెంట్ కంట్రోల్, రియర్ లిఫ్ట్-ఆఫ్ ప్రొటెక్షన్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఈ బైక్‌లో ఉన్నాయి. 2025 అపాచీ ఆర్టీఆర్ 310లో సూపర్‌మోటోతో సహా 5 రైడ్ మోడ్‌లు, క్లాస్-డి ఎల్‌ఈడీ రిఫ్లెక్టర్, డైనమిక్ ట్విన్ టెయిల్ ల్యాంప్, క్లచ్ కవర్ వంటివి కూడా ఉన్నాయి. బైక్‌లో 5-అంగుళాల టీఎఫ్‌టీ జెన్-2 కనెక్టెడ్ క్లస్టర్, సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లు కూడా అందించారు. ఈ కొత్త బైక్ బేస్, టాప్ అనే రెండు ట్రిమ్స్‌లో లభిస్తుంది. బేస్ ట్రిమ్ ధర రూ. 2.40 లక్షలు (ఎక్స్-షోరూమ్). టాప్ ట్రిమ్ ధర రూ. 2.57 లక్షలు (ఎక్స్-షోరూమ్) అదనంగా, డైనమిక్ ప్యాక్ ధర రూ. 2.75 లక్షలు (ఎక్స్-షోరూమ్), డైనమిక్ ప్రో ప్యాక్ ధర రూ. 2.85 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories