Honda Activa-e: 2 బ్యాటరీలు, 102 కిమీ రేంజ్ ఉన్నా ఈ స్కూటర్ కొనేదిక్కేలేదు

Honda Activa-e: 2 బ్యాటరీలు, 102 కిమీ రేంజ్ ఉన్నా  ఈ స్కూటర్ కొనేదిక్కేలేదు
x
Highlights

Honda Activa-e: ఈ ఏడాది ప్రారంభంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్‌లోకి అడుగుపెట్టిన హోండా.. తన రెండు ఇ-స్కూటర్లు ఆక్టివా ఇ, క్యూసి1 ఉత్పత్తి, అమ్మకాలను ప్రారంభించి 6 నెలలు పూర్తయ్యాయి.

Honda Activa-e: ఈ ఏడాది ప్రారంభంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్‌లోకి అడుగుపెట్టిన హోండా.. తన రెండు ఇ-స్కూటర్లు ఆక్టివా ఇ, క్యూసి1 ఉత్పత్తి, అమ్మకాలను ప్రారంభించి 6 నెలలు పూర్తయ్యాయి. ఫిబ్రవరి నుంచి జూలై 2025 మధ్య కంపెనీ మొత్తం 11,168 యూనిట్లు తయారు చేసి, అందులో 5,173 యూనిట్లు విక్రయించింది. వీటి డెలివరీలు మార్చి 2025 నుంచి మొదలయ్యాయి.

ఆక్టివా ఇ అనేది రిమూవబుల్ బ్యాటరీలతో కూడిన ఎలక్ట్రిక్ స్కూటర్. దీనిని వ్యక్తిగత అవసరాల కోసం రూపొందించారు. మరోవైపు, హోండా క్యూసి1లో ఫిక్స్‌డ్ బ్యాటరీ ఉంది. ఇది ప్రధానంగా గిగ్-వర్కర్లు (డెలివరీ పార్టనర్స్), తక్కువ ధర గల ప్రయాణాల కోసం డిజైన్ చేశారు. మొదటి 5 నెలల్లో హోండా మొత్తం 4,950 యూనిట్లు విక్రయించింది. ఇందులో 4,252 యూనిట్లు క్యూసి1 కాగా, కేవలం 698 యూనిట్లు మాత్రమే ఆక్టివా ఇ. అంటే, క్యూసి1 వాటా ఏకంగా 86%.

ఆక్టివా ఇ చూడటానికి స్టైలిష్‌గా, అడ్వాన్స్‌డ్‌గా ఉన్నప్పటికీ, దాని భవిష్యత్తు హోండా ఎంత త్వరగా తమ బ్యాటరీ మార్పిడి నెట్‌వర్క్‌ను విస్తరిస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. లుక్స్ పరంగా ఇది పెట్రోల్ ఆక్టివా కంటే చాలా స్టైలిష్‌గా ఉంది. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. స్టాండర్డ్ ధర రూ.1,17,428 (ఎక్స్-షోరూమ్) కాగా, రోడ్‌సింక్ డ్యూయో ధర రూ.1,52,028 (ఎక్స్-షోరూమ్). ఇది 102 కి.మీ. రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. దీని టాప్ స్పీడ్ 80 కి.మీ./గంట. 7.3 సెకన్లలో 0 నుంచి 60 కి.మీ./గంట వేగాన్ని అందుకోగలదు.

దీని అతిపెద్ద లోపం ఏమిటంటే, బ్యాటరీని ఇంట్లో ఛార్జ్ చేయలేరు. కేవలం బ్యాటరీ ఎక్స్చేంజ్ స్టేషన్లలో మాత్రమే మార్చగలరు. ఇదే దాని అమ్మకాలు మందగించడానికి ప్రధాన కారణం. ప్రస్తుతం, 80కి పైగా బ్యాటరీ మార్పిడి స్టేషన్లు కేవలం బెంగళూరులో మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీ, ముంబైలో కూడా ప్రారంభమవుతున్నాయి.

క్యూసి1 తక్కువ ధర, ఇంట్లో ఛార్జింగ్ చేసుకునే సౌలభ్యం కారణంగా మార్కెట్లో పట్టు సాధిస్తోంది. క్యూసి1 ధర రూ.90,022 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇది భారతదేశంలో అత్యంత చవకైన జపనీస్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది 80 కి.మీ. రేంజ్‌ను ఇస్తుంది. పర్ఫామెన్స్ విషయానికి వస్తే, ఇది 9.4 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ./గంట వేగాన్ని అందుకోగలదు. దీని టాప్ స్పీడు 50 కి.మీ./గంట. ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బెంగళూరు, హైదరాబాద్, ముంబై, పుణె, ఢిల్లీ, చండీగఢ్ వంటి నగరాల్లో కొనుగోలు చేయవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories