Lakshmi Mantras Chant: అష్టలక్ష్మీ ఆశీర్వాదం పొందే రహస్య మంత్రాలు ఇవే!

Lakshmi Mantras Chant: అష్టలక్ష్మీ ఆశీర్వాదం పొందే రహస్య మంత్రాలు ఇవే!
x

Lakshmi Mantras Chant: అష్టలక్ష్మీ ఆశీర్వాదం పొందే రహస్య మంత్రాలు ఇవే!

Highlights

లక్ష్మీదేవి అనగానే డబ్బు, సంపద, శ్రేయస్సు, అదృష్టం, సుఖశాంతి గుర్తుకొస్తాయి. ఆమెను మహాలక్ష్మి అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం, అలాగే దీపావళి సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తారు.

లక్ష్మీదేవి మంత్రాలు

లక్ష్మీదేవి అనగానే డబ్బు, సంపద, శ్రేయస్సు, అదృష్టం, సుఖశాంతి గుర్తుకొస్తాయి. ఆమెను మహాలక్ష్మి అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం, అలాగే దీపావళి సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తారు. లక్ష్మీ అనగా “లక్ష్యానికి దారి చూపే శక్తి”. జీవితంలో అష్టసంపదలు కావాలని కోరుకునే భక్తులు అష్టలక్ష్ములను ఆరాధిస్తారు.

ప్రతిరోజూ లక్ష్మీదేవిని స్మరించడం ద్వారా మనసులో ప్రశాంతత, ఇంట్లో ఆనందం, ఆర్థికాభివృద్ధి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ 8 పవర్‌ఫుల్ లక్ష్మీ మంత్రాలు పఠించడం ద్వారా ఆధ్యాత్మిక, భౌతిక శ్రేయస్సు పొందవచ్చు. ప్రతిరోజూ లేదా కనీసం శుక్రవారం, పౌర్ణమి, వరలక్ష్మీ వ్రతం, దీపావళి వంటి పర్వదినాల్లో పఠించడం అత్యంత శ్రేయస్కరం.

1. ఓం శ్రీం మహాలక్ష్మియే నమః

సంపద, జ్ఞానం, శుభాల అధిదేవత అయిన లక్ష్మీదేవికి నమస్కారం. ఈ మంత్రం పఠించడం వల్ల ఆర్థిక అడ్డంకులు తొలగి ఇంటిలో శాంతి, సిరి సంపదలు పెరుగుతాయి.

2. ఓం హ్రీం శ్రీం కీం మహాలక్ష్మియే నమః

ఈ మంత్రం భౌతిక, ఆధ్యాత్మిక శ్రేయస్సు, ప్రేమ, సామరస్యం కలిగిస్తుంది. ప్రతి రంగంలో విజయం సాధించడంలో సహాయపడుతుంది.

3. ఓం శ్రీం శ్రీ అయే నమః

సంతోషం, ఆనందం కోసం జపించే మంత్రం ఇది. శ్రీ అనేది సంపద, శుభాన్ని సూచిస్తుంది. పఠించడం వల్ల మానసిక ప్రశాంతత, ఆనందం లభిస్తాయి.

4. ఓం మహాదేవ్యేచ విద్మహే, విష్ణు పత్నేచ దీమహే, తన్నో లక్ష్మీ ప్రచోదయాత్‌

ఇది లక్ష్మీ గాయత్రీ మంత్రం. పఠిస్తే దైవకృప కలిగి ఆధ్యాత్మిక అభివృద్ధి, శ్రేయస్సు, ఆరోగ్యం కలుగుతాయి.

5. ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మీ మమ గృహే ధనం పూరయ పూరయ నమః

అష్టలక్ష్మీ, కుబేరులను స్తుతించే మంత్రం. పఠిస్తే ధనం, సంపద, ఐశ్వర్యం సమృద్ధిగా లభిస్తాయి.

6. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః

ఇది శుక్ర గ్రహాన్ని అనుకూలం చేసే బీజ మంత్రం. ప్రతి శుక్రవారం 108 సార్లు జపిస్తే ఆర్థికాభివృద్ధి, అదృష్టం కలుగుతాయి.

7. ఓం సర్వబాధా వినిర్ముక్తో ధనధాన్య సుతాన్వితః మనుష్యో మత్‌ ప్రసాదేన భవిష్యతి న సంశయః ఓం

ఈ మంత్రం పఠించడం ద్వారా అడ్డంకులు తొలగి ధనం, సంతానం, సుఖశాంతి లభిస్తాయి. చెడు శక్తులు తొలగిపోతాయి.

8. ఓం శ్రింగ్ హ్రింగ్ క్లింగ్ శ్రింగ్ సిద్ధ లక్ష్మయై నమః

సంపద, ఐశ్వర్యం, విజయం కోసం పఠించే శక్తివంతమైన మంత్రం. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది.

గమనిక:

ఈ సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. ఇవి కేవలం అవగాహన కోసం మాత్రమే. శాస్త్రీయ ఆధారాలు లేవు. విశ్వాసం మీ వ్యక్తిగత నిర్ణయం.

Show Full Article
Print Article
Next Story
More Stories