Akshaya Tritiya: విష్ణువును ప్రతిష్ఠించి.. ఇలా చేయండి.. లక్ష్మీదేవి మీ తలుపు తట్టడమే కాదు..లోకలికి కూడా వచ్చేస్తుంది!

Akshaya Tritiya:  విష్ణువును ప్రతిష్ఠించి.. ఇలా చేయండి.. లక్ష్మీదేవి మీ తలుపు తట్టడమే కాదు..లోకలికి కూడా వచ్చేస్తుంది!
x

Akshaya Tritiya: విష్ణువును ప్రతిష్ఠించి.. ఇలా చేయండి.. లక్ష్మీదేవి మీ తలుపు తట్టడమే కాదు..లోకలికి కూడా వచ్చేస్తుంది!

Highlights

పూజ తర్వాత విష్ణువుకు, లక్ష్మీదేవికి హారతి ఇచ్చి, నైవేద్యం సమర్పించి, మిఠాయిలను ప్రసాదంగా పంచుకోవడం ద్వారా శుభఫలితాలు లభిస్తాయి.

అక్షయ తృతీయ అనేది ప్రతి ఏడాది తన ప్రత్యేకతను చాటుకునే పవిత్ర రోజు. అక్షయ అంటే ఎప్పటికీ తరుగని శ్రేయస్సు, ఆనందం, విజయం అని అర్థం, తృతీయ అంటే చంద్రుని మూడో దశను సూచిస్తుంది. దీనిని అక్తి లేదా అఖ్ తీజ్ అని కూడా పిలుస్తారు. హిందూ పురాణాల ప్రకారం వేద వ్యాసుడు ఈ రోజున మహాభారత రచన ప్రారంభించాడు. గంగమ్మ తల్లి భూమికి దిగినదీ ఇదే రోజు. కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి అపార ధనవంతుడయ్యాడన్న నమ్మకం ఉంది. ద్రౌపదికి శ్రీకృష్ణుడు చీరను ప్రసాదించిన ఘట్టం కూడా ఈ పవిత్ర రోజున చోటుచేసుకున్నది.

ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం హిందూ సంప్రదాయంలో చాలా ముఖ్యమైన కార్యంగా భావిస్తారు. బంగారం కొనుగోలు చేయడం సంపదలో వృద్ధికి సూచికగా నమ్మడం సంప్రదాయం. కానీ నిజానికి ఈ రోజున దానం చేయడం ద్వారా శాశ్వతమైన పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మహాభారతంలో క్రిష్ణుడు యుధిష్ఠరునికి ఇచ్చిన అక్షయ పాత్రకు సంబంధించిన ప్రస్తావన దీనికి ఆధారంగా ఉంది. అలాగే కొత్త ఇంట్లో ప్రవేశించడం, కొత్త వాహనం కొనుగోలు చేయడం, వివాహాలు వంటి శుభకార్యాలకు కూడా అక్షయ తృతీయను అనుకూలమైన రోజుగా పరిగణిస్తారు. కొబ్బరికాయలు, దక్షిణావర్తి శంఖం, శివలింగాలను కొనుగోలు చేయడం కూడా ఈ రోజున శుభంగా భావిస్తారు.

అక్షయ తృతీయ నాడు తెల్లవారుజామునే లేచి, స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పసుపు రంగు దుస్తులు ధరిస్తే విశేష ఫలితాలనందిస్తాయని నమ్మకం. పూజా మండపం ఏర్పాటు చేసి, విష్ణువును ప్రతిష్ఠించి, శుద్ధి చేయాలి. తులసి, పండ్లు, పువ్వులు సమర్పిస్తూ భక్తితో పూజించాలి. ముఖ్యంగా పసుపు పువ్వులతో పూజిస్తే మంచి ఫలితాలు పొందుతారు. పూజ అనంతరం విష్ణువుకు, లక్ష్మీదేవికి హారతి ఇచ్చి, నైవేద్యం సమర్పించి, మిఠాయిలను ప్రసాదంగా పంచుకోవడం ద్వారా శుభఫలితాలు లభిస్తాయి. అక్షయ తృతీయ పూజ ఈ విధంగా జరగాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories