Datta Jayanti 2025: ఈరోజే దత్త జయంతి, దత్తాత్రేయుని జననం–ప్రాముఖ్యత–చేయాల్సిన పూజలు ఇవే!

Datta Jayanti 2025: ఈరోజే దత్త జయంతి, దత్తాత్రేయుని జననం–ప్రాముఖ్యత–చేయాల్సిన పూజలు ఇవే!
x
Highlights

Datta Jayanti 2025: ఈరోజు దత్త జయంతి సందర్భంగా దత్తాత్రేయుడి జననం, ఆయన అవతార ప్రాముఖ్యత, పూజలు, ఉపవాసం, దానం, ప్రత్యేక పరిహారాలు ఏవో తెలుసుకోండి. మార్గశిర పౌర్ణమి ఆరాధన వివరాలు.

Datta Jayanti 2025: ఈ ఏడాది దత్త జయంతి డిసెంబర్ 4, గురువారం రోజున వచ్చింది. మార్గశిర పౌర్ణమి సందర్భంగా శ్రీ దత్తాత్రేయ స్వామిని దేశవ్యాప్తంగా భక్తులు ఘనంగా ఆరాధిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఈ పర్వదినాన్ని ప్రత్యేక ఉత్సాహంతో జరుపుకుంటారు.

ఈ పవిత్ర దినాన దత్తాత్రేయుడి జననం, ఆయన అవతార రహస్యాలు, దత్త జయంతి ప్రాముఖ్యత, ఈ రోజున చేయాల్సిన పూజలు–పరిహారాలు గురించి తెలుసుకుందాం.

దత్త జయంతి ప్రాముఖ్యత ఏమిటి?

మార్గశిర మాసం పౌర్ణమి రోజు దత్తాత్రేయ స్వామి జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు చంద్రుడు పౌర్ణమి తిథిలో వెలుగుతుండటంతో శుభాలు, శాంతి, సంపద లభిస్తాయి. దత్తాత్రేయుడిని గురువుగా, యోగ మార్గదర్శకుడిగా భక్తులు భావిస్తున్నారు.

ఎందుకు దత్తాత్రేయుడిని ‘గురు దత్తుడు’గా పూజిస్తారు?

దత్తాత్రేయుడు అత్రి మహర్షి–అనసూయా దంపతులకు పుట్టారు. ఆయనలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిగుణ శక్తులు నిలిచాయి. అందుకే ఆయనను మూడు ముఖాలతో చిత్రిస్తారు. దత్తాత్రేయుడు యదు, ప్రహ్లాదుడు, కార్తవీర్యార్జునుడు వంటి మహాభక్తులకు పరమజ్ఞానాన్ని ప్రసాదించినందుకు ‘గురు దత్తుడు’గా పూజించబడతాడు.

దత్తాత్రేయ జననం ఎలా జరిగింది?

అత్రి మహర్షి కఠోరమైన తపస్సుకు సంతృప్తిచెందిన పరమాత్మ వాసుదేవుడు స్వయంగా ఆయన ఇంట జన్మించాడు. బ్రహ్మ–విష్ణు–మహేశ్వరుల త్రిపుర శక్తుల సమ్మిళిత అవతారమే దత్తాత్రేయుడు. అందుకే మహాయోగిగా, సన్యాస ఆశ్రమ పరిపాలకుడిగా ఆయనకు ప్రత్యేక గౌరవం ఉంది.

Datta Jayanti 2025: ఈరోజు ఏం చేయాలి?

ఈరోజు దత్తాత్రేయ స్వామిని ఆరాధిస్తే భక్తులకు జ్ఞానం, శాంతి, కుటుంబ శ్రేయస్సు, ఆరోగ్యం లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

✔️ ఉదయం తప్పనిసరి స్నానం

  • నది స్నానం ఉత్తమం
  • సాధ్యం కాకుంటే, బావి నీరు లేదా శుద్ధజలంతో స్నానం చేయాలి

✔️ దత్తాత్రేయ పూజ–ధ్యానం

  • శోఢషోపచార పూజ
  • దత్త గాయత్రి, దత్త నామ జపం
  • గురువు గురించి, ఆధ్యాత్మిక మార్గదర్శకుల చరిత్రల పారాయణం

✔️ దత్తక్షేత్రాల దర్శనం

  • ఈరోజు దత్త క్షేత్రాలను సందర్శిస్తే పాపాలు నశిస్తాయని విశ్వాసం
  • పితృదోషాలు, కర్మదోషాలు తగ్గుతాయని పురాణాలు చెబుతున్నాయి

✔️ దానం–పూజలలో ప్రత్యేకత

  • దత్తాత్రేయుడికి ఇష్టమైన గోమాత, శునకం పూజిస్తే శ్రేయస్సు కలుగుతుంది
  • భోజనం, వస్త్ర దానం చేస్తే పుణ్యం పెరుగుతుంది

✔️ ఉపవాసం

  • పౌర్ణమి ఉపవాసం మహా శుభప్రదం
  • మానసిక శాంతి, ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది

✔️ గంగా పూజ

  • ప్రత్యేక నమ్మకం ప్రకారం దత్తాత్రేయుడు ఈరోజే గంగానది స్నానం చేయడానికి భూమి మీదకు వచ్చాడని చెబుతారు.
  • అందుకే గంగా తీరం వద్ద దత్త పాదుకల పూజ అత్యంత శ్రేష్ఠం.

దత్త జయంతి పర్వదినం: లభించే శుభఫలాలు

  • పితృదోష విమోచనం
  • పెండింగ్ పనులు పూర్తికావడం
  • ధనం–ధాన్యం ప్రాప్తి
  • మానసిక ప్రశాంతత
  • కుటుంబంలో ఐశ్వర్యం, శాంతి
Show Full Article
Print Article
Next Story
More Stories