Ganesh Chaturthi 2025: గణేశ విగ్రహ ప్రతిష్ట శుభ ముహూర్తం, పూజా విధానం పూర్తి వివరాలు

Ganesh Chaturthi 2025: గణేశ విగ్రహ ప్రతిష్ట శుభ ముహూర్తం, పూజా విధానం పూర్తి వివరాలు
x

Ganesh Chaturthi 2025: గణేశ విగ్రహ ప్రతిష్ట శుభ ముహూర్తం, పూజా విధానం పూర్తి వివరాలు

Highlights

ప్రతి సంవత్సరం భాద్రపద శుక్ల చతుర్థి రోజున జరుపుకునే గణేష్ చతుర్థి ఈసారి ఆగస్టు 27న జరగనుంది. గణనాథుని ఆరాధన కోసం దేశవ్యాప్తంగా ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. పండుగ రోజు విగ్రహ ప్రతిష్టకు శుభ ముహూర్తం, పూజా విధానం, వాస్తు సూచనలు, అలాగే చంద్రదర్శనం నిషేధం వంటి విషయాలను పండితులు వివరించారు.

శుభ ముహూర్తం:

భాద్రపద శుక్ల చతుర్థి ఆగస్టు 26న మధ్యాహ్నం 1:54కి ప్రారంభమై, ఆగస్టు 27న మధ్యాహ్నం 3:44 వరకు కొనసాగుతుంది. ఈ రోజు గణపతి ప్రతిష్టకు ఉత్తమ సమయం ఉదయం 11:05 నుండి మధ్యాహ్నం 1:40 వరకు ఉంది. ఈ 2 గంటల 34 నిమిషాల వ్యవధిలో విగ్రహ ప్రతిష్ట అత్యంత శుభప్రదమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

పూజా విధానం:

గణేష్ చతుర్థి నాడు స్నానం చేసి, ఇల్లు శుభ్రం చేసి, మామిడాకు తోరణాలు, పూలతో అలంకరించాలి. పీటపై పసుపు రాసి, బియ్యం నింపిన పాత్రపై తమలపాకులు వేసి, వాటిపై గణేశ విగ్రహం ప్రతిష్టించాలి. ఆవు నెయ్యంతో దీపాలు వెలిగించి, పూలు, పండ్లు, ఉండ్రాళ్లు, కుడుములు, పాయసం వంటి నైవేద్యాలు సమర్పించాలి. వ్రతకల్పం చదివి పూజ పూర్తిచేయాలి.

మండప వాస్తు సూచనలు:

గణేశ మండపం తూర్పు లేదా ఉత్తరం వైపున ఉండేలా చూసుకోవాలి. గణపతి ముఖం ఆ దిశలకు ఉండేలా ప్రతిష్టించడం శ్రేయస్కరం.

చంద్రదర్శనం నిషేధం:

ఆగస్టు 26 మధ్యాహ్నం 1:54 నుండి రాత్రి 8:29 వరకు, ఆగస్టు 27 ఉదయం 9:28 నుండి రాత్రి 8:57 వరకు చంద్రుడిని చూడరాదు. ఈ సమయంలో చంద్రదర్శనం అశుభకరమని శాస్త్రం చెబుతోంది.

విగ్రహం ఇంటికి తీసుకురావడం:

సాధారణంగా వినాయక విగ్రహాన్ని హర్తాళిక తీజ్ రోజునే ఇంటికి తీసుకువస్తారు. ఈసారి ఆగస్టు 26 ఉదయం 9:09 నుండి మధ్యాహ్నం 1:59 వరకు విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం మంచిది.

విగ్రహం జాగ్రత్తలు:

మట్టి గణేశ విగ్రహమే శుభప్రదం. తొండం ఎడమ వైపు ఉండే గణపతిని ప్రతిష్ఠించాలి. ఇంట్లో కూర్చుని ఉన్న విగ్రహాన్ని ఎంచుకోవడం ఉత్తమం. తెలుపు రంగు విగ్రహం శుభకరంగా భావిస్తారు. ముఖ్యంగా, విగ్రహం ఎట్టి పరిస్థితుల్లోనూ విరిగిపోకుండా జాగ్రత్త వహించాలి.

ఈ గణేష్ చతుర్థి రోజున శాస్త్రోక్త పద్ధతిలో విగ్రహ ప్రతిష్ట చేసి పూజలు చేస్తే వినాయకుని అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories