మార్గశిర గురువారం వ్రతం – మార్గశిర లక్ష్మీవార వ్రతం కథ

మార్గశిర గురువారం వ్రతం – మార్గశిర లక్ష్మీవార వ్రతం కథ
x

మార్గశిర గురువారం వ్రతం – మార్గశిర లక్ష్మీవార వ్రతం కథ

Highlights

హిందూ ధర్మంలో పూజలు, వ్రతాలు, నోములు ప్రధాన పాత్ర వహిస్తాయి. ప్రత్యేకంగా శ్రావణం నుండి మాఘ మాసం వరకు అనేక పండుగలు, వ్రతాలు జరుగుతుంటాయి.

హిందూ ధర్మంలో పూజలు, వ్రతాలు, నోములు ప్రధాన పాత్ర వహిస్తాయి. ప్రత్యేకంగా శ్రావణం నుండి మాఘ మాసం వరకు అనేక పండుగలు, వ్రతాలు జరుగుతుంటాయి. ఈ సందర్భంలో శ్రీమహావిష్ణువుకు అతి ప్రీతికరమైన మార్గశిర మాసం ఎంతో పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారం చేసుకునే లక్ష్మీపూజను మార్గశిర లక్ష్మీవార వ్రతం లేదా మార్గశిర గురువారం వ్రతం అని పిలుస్తారు.

పురాణాల్లో పరాశర మహర్షి, నారద మహర్షికి ఈ గురువారం వ్రతం గురించి వివరించారు. ఈ వ్రతాన్ని శ్రద్ధతో ఆచరించిన వారికి లక్ష్మీ కటాక్షం, సిరిసంపదలు, శ్రేయస్సు, ఆరోగ్యం, ఋణ విమోచనం లభిస్తాయని నమ్మకం.

భక్తి తో ఇంటిని శుభ్రంగా ఉంచి, దీపాలు వెలిగించి, లక్ష్మీదేవిని పూజించిన స్త్రీలకు దారిద్ర్యం దూరమై, ఆయురారోగ్యాలు పెరుగుతాయని పండితులు చెబుతున్నారు. లక్ష్మీ కటాక్షం అంటే ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం, సౌభాగ్యం, ఆనందం, సంపద అని అర్థం.

ఇప్పుడు మార్గశిర లక్ష్మీవార వ్రతం కథ గురించి తెలుసుకుందాం

మార్గశిర లక్ష్మీవార వ్రతం కథ

పూర్వం కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సుశీల అనే కుమార్తె. చిన్నతనంలోనే తల్లి మరణించడంతో సుశీల తన సవతి తల్లి వద్ద పెరిగింది. సవతి తల్లి తన పిల్లలను జోలపాడమని చెప్పి కొద్దిగా బెల్లం ఇస్తూ ఉండేది. సుశీల కూడా వారికి ప్రేమగా జోలపాడుతూ ఉండేది.

ఒక రోజు ఆమె సవతి తల్లి ఇంట్లో మార్గశిర లక్ష్మీవార పూజ జరుగుతుండటం చూసింది. దాంతో సుశీలకూ ఆ పూజ చేయాలనే కోరిక కలిగింది. అందుకే చిన్నచిన్న మట్టికొద్దితో మహాలక్ష్మీ విగ్రహాన్ని తయారు చేసి, జిల్లేడు పూలతో, ఆకులతో భక్తిశ్రద్ధలతో పూజ చేసింది. తన సవతి తల్లి ఇచ్చిన బెల్లాన్ని నైవేద్యంగా పెట్టింది.

ఆమె చిన్నతనపు భక్తి, అంకితభావంతో చేసిన ఆ వ్రతమే సుశీల భవిష్యత్తుని మలిచిందని పురాణాలు చెబుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories