సూర్య గమనంలో దక్షిణాయనం ప్రారంభం.. ఈ నియమాలు పాటిస్తే శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం!

సూర్య గమనంలో దక్షిణాయనం ప్రారంభం.. ఈ నియమాలు పాటిస్తే శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం!
x

సూర్య గమనంలో దక్షిణాయనం ప్రారంభం.. ఈ నియమాలు పాటిస్తే శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం!

Highlights

దక్షిణాయన పుణ్యకాలం 2025: జూలై 16, 2025 నుంచి దక్షిణాయనం ప్రారంభమైంది. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ ఆరు నెలల పుణ్యకాలం మొదలైంది. మకర సంక్రాంతి వరకు కొనసాగనున్న ఈ కాలం పూజలు, వ్రతాలు, దానాలు చేయడానికి అత్యంత శుభప్రదంగా భావిస్తారు.

దక్షిణాయనం ప్రాముఖ్యత

శాస్త్రాల ప్రకారం సూర్యుని గమనాన్ని రెండు భాగాలుగా విభజిస్తారు:

ఉత్తరాయణం: సూర్యుడు ఉత్తరం వైపు సంచరించే కాలం.

దక్షిణాయనం: సూర్యుడు దక్షిణం వైపు సంచరించే కాలం.

ఈ కాలంలో శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఉంటారని విశ్వాసం. అందుకే యోగులు, సన్యాసులు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు.

పితృదేవతల ఆరాధన

దక్షిణాయనం కాలం పితృదేవతలను ఆరాధించడానికి అత్యంత శ్రేయస్కరమని చెబుతారు.

పిండ ప్రదానాలు, పితృతర్పణాలు, సాంధ్యవందనం వంటివి పుణ్యఫలాలను అందిస్తాయని, వంశాభివృద్ధి కలుగుతుందని విశ్వాసం.

సాత్వికాహారం తీసుకోవడం వల్ల కోపం తగ్గి, మనసు ప్రశాంతంగా ఉంటుంది.

ఈ కాలంలో చేయాల్సిన పూజలు, పరిహారాలు

శ్రీ మహావిష్ణు ఆరాధన: తులసితో పూజ చేసి, విష్ణు సహస్రనామం పారాయణం చేయడం కుటుంబ సౌఖ్యానికి దోహదం చేస్తుంది.

సూర్య ఆరాధన: ఆదిత్య హృదయం, గాయత్రీ మంత్రం జపించడం ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు మంచిదని నమ్మకం.

దానాలు, సేవా కార్యక్రమాలు: పేదలకు అన్నదానం, పక్షులకు ఆహారం పెట్టడం పుణ్యఫలాలను ఇస్తుంది.

ఉగ్ర దేవతల పూజ: ఈ కాలంలో ఉగ్ర దేవతల ఆరాధన కూడా శుభఫలాలను ఇస్తుందని పెద్దలు చెబుతారు.

ముఖ్య గమనిక

ఇది శాస్త్రాలలో పేర్కొన్న విశ్వాసాల ఆధారంగా రాయబడింది. శాస్త్రీయ ఆధారాలు లేవు. వ్యక్తిగత విశ్వాసాన్ని బట్టి ఆచరించవచ్చు

Show Full Article
Print Article
Next Story
More Stories