శివరాత్రి విశిష్టత... మీరు తెలుసుకోవాల్సిన 9 ముఖ్యాంశాలు

శివరాత్రి విశిష్టత... మీరు తెలుసుకోవాల్సిన 9 ముఖ్యాంశాలు
x
Highlights

1. శివరాత్రి పండుగ చాంద్రమానం ప్రకారం ప్రతి మాసంలో 14వ రోజు లేదా అమావాస్యకు ముందు రోజు వస్తుంది. ఈ పన్నెండు శివరాత్రులలో ఫిబ్రవరి-మార్చి నెలల్లో అంటే...

1. శివరాత్రి పండుగ చాంద్రమానం ప్రకారం ప్రతి మాసంలో 14వ రోజు లేదా అమావాస్యకు ముందు రోజు వస్తుంది. ఈ పన్నెండు శివరాత్రులలో ఫిబ్రవరి-మార్చి నెలల్లో అంటే మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి నాడు వచ్చే మహా శివరాత్రికి అత్యంత ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ రోజు రాత్రి భూమి ఉత్తర అర్ధ గోళం చాలా శక్తిమంతంగా ఉంటుంది. గ్రహరాశుల స్థితి గతులు ఉత్తర ధ్రువానికి ప్రేరకాలుగా ఉంటాయి. ఈ స్థితి మనిషిలోని శక్తిని ఉప్పొంగేలా చేస్తుంది. అందుకే, మహాశివరాత్రి నాడు తెల్లవార్లూ జాగారం చేస్తూ వెన్నె ముకను నిటారుగా ఉంచడం ద్వారా మన నుంచి శక్తులు సహజంగానే ఎగసిపడేందుకు సహకరించవచ్చు.

2. స్కంద పురాణం ప్రకారం, మహా ప్రళయం తరువాత సృష్టి కారకుడైన బ్రహ్మకు, స్థితి కారకుడైన విష్ణువుకు మధ్య ఎవరు గొప్పో తేల్చుకోవాలన్న పోటీ వచ్చింది. అది మహా యుద్ధానికి దారి తీసింది. వారు పరస్పరం సంధించుకునవే అస్త్రాలతో మరో ప్రళయం వస్తుందని గుర్తించిన లయకారకుడైన శివుడు దాన్ని ఆపేందుకు రంగంలోకి దిగాడు. ఆది, అంతం తెలియని మహాగ్ని స్తంభం రూపంలో అవతరించి దర్శనమిచ్చాడు. ఈ లింగోద్భవం జరిగింది మాఘ బహుళ చతుర్దశి నాడు.. అంటే మహాశివరాత్రి నాడు.

3. ఒక రోజంతా ఉపవాసం, జాగరణతో శివుడిని బిల్వ ఆకులను సమర్పించి పూజిస్తే దైవిక శక్తి అనుగ్రహిస్తుందని శివభక్తులు విశ్వసిస్తారు. శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాల గురించి పాల్కురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రము అనే గ్రంథంలో విపులంగా వర్ణించారు. శివభక్తులు ధరిచే విభూతిని తయారు చేయడానికి ఈరోజు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.

4. జాగరణ అంటే జాగరూకంగా ఉండడం. జాగరూకత అంటే మెలకువగా ఉంటూ తెలుసుకోవడం అని అర్ధం. మానవ జీవంలో శక్తి సహజంగానే ఉంటుంది. గ్రహాలు శక్తిమంతంగా భూమిని ప్రేరేపించే మహాశివరాత్రి రోజున జాగరూకతగా ఉన్న మనిషులు ఆధ్యాత్మిక క్షేమాన్ని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి.

5. గృహస్థాశ్రమం అంటే కుటుంబ జీవనంలో ఉన్నవారు మహాశివరాత్రిని శివుడి పెళ్ళిరోజుగా చూస్తారు. శివ, పార్వతులు పెళ్ళి చేసుకున్నది ఈరోజునే అనే శివపురాణం చెబుతోంది. అలాగే, జీవితంలో ఒక లక్ష్యం కోసం పోరాడే వారు ఈ రోజుని విజయోత్సవంగా భావిస్తారు. ఎందుకంటే, ఇది పరమ శివుడు శత్రువులందరినీ జయించిన రోజు. తాపసులు, సన్యాసులు ఈ రోజును శివుడు కైలాసపర్వతంలో లీనమైన రోజుగా భావిస్తారు.

6. శివుడిని యోగ సంప్రదాయంలో దేవుడిగా భావించరు. యోగ శాస్త్రానికి మూలకారకుడైన ఆదియోగి లేదా ఆది గురువుగా పూజిస్తారు. వేల ఏళ్ళ ధ్యానం తరువాత ఓరోజున శివుడు నిశ్చలంగా మారిపోయారట. ఆ రోజే మహాశివరాత్రి అని వారి నమ్మకం. అందుకే, సన్యాసులు మహా శివరాత్రిని నిశ్చలతకు ప్రతీకగా చూస్తారు.

7. యోగి అంటే ఈ సమస్త ఉనికి ఏకత్వాన్ని గ్రహించినవాడు అని అర్థం. యోగ అంటే శారీరక సాధన, అభ్యాసం మాత్రమే కాదు. అది ప్రకృతిలో లీనం కావడం, సమస్త సృష్టి ఏకత్వాన్ని తెలుసుకోవాలనే ఆకాంక్షకు మార్గం అని అంటారు యోగ సాధకులు. ఈ సృష్టిలోని సకల జీవరాశులు, పదార్థాలు, నక్షత్ర మండలాలు అన్నీ కూడా ఒకే ఒక శక్తికి కోట్లాది వ్యక్తీకరణలు అని తెలుసుకునే ఆధ్యాత్మిక ఉన్నతి మహాశివరాత్రి రోజున సాధ్యమవుతుందని హిందూ ఇతిహాసాలు చెబుతున్నాయి.

8. భారతీయ సంస్కృతిలో ఒకప్పుడు ఏడాదికి 365 పండుగలు ఉండేవని మన పురాణాలు చెబుతున్నాయి. అంటే, హిందూ ధర్మంలో ఏడాదిలో ప్రతి రోజూ పండగే. ప్రతిరోజూ ఉత్సవమే. ఈ 365 పండుగల వెనుక అనేక చారిత్రక ఘటనలు, విజయాలు, మానవ జీవనంలోని ముఖ్యమైన ఘట్టాలు అంటే నాట్లు వేయడం, పంట కోతకు రావడం వంటి కారణాలున్నాయి. వీటన్నింటిలో మహాశివరాత్రికి మరింత ప్రత్యేకత ఉందంటారు ఆధ్యాత్మిక గురువులు. అది మనిషిని సమస్త శక్తికి చేరువ చేసే రోజు.

9. ఈ పవిత్ర రాత్రిలో మహాశివుడు తాండవం చేస్తాడు. అందుకే, ఈ రాత్రి శివభక్తులకు పరమ పవిత్రమైన పండుగ.

ఓం నమః శివాయ.

Show Full Article
Print Article
Next Story
More Stories