ప్రదోషకాలం అంటే ఏమిటి? ఆ సమయంలో శివారాధన ఎందుకు విశేషం?

ప్రదోషకాలం అంటే ఏమిటి? ఆ సమయంలో శివారాధన ఎందుకు విశేషం?
x

ప్రదోషకాలం అంటే ఏమిటి? ఆ సమయంలో శివారాధన ఎందుకు విశేషం?

Highlights

తిథుల్లో త్రయోదశి, చతుర్దశి ఎంతో ప్రత్యేకమైనవి. వారాలలో బుధవారం, గురువారం విశేష ప్రాధాన్యం కలిగినవిగా భావిస్తారు. ‘ప్రదోషం’ అంటే రాత్రి ఆరంభం అనే అర్థం. అంటే సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్యకాలాన్ని ప్రదోషకాలంగా పరిగణిస్తారు.

ఈ సమయంలో పరమశివుడిని పూజించడం, శివ పంచాక్షరి జపం చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. విద్యార్థులకు జ్ఞాపకశక్తి పెరుగుతుందని విశ్వసిస్తారు. త్రయోదశికి మన్మథుడు, చతుర్దశికి కలి పురుషుడు అధిపతులు. వీరిని నియంత్రించగల శక్తి ఒక్క పరమేశ్వరుడికే ఉంది. అదేవిధంగా బుధవారం, గురువారం బుద్ధి, వాక్కులకు ప్రతీకలు కావడంతో ఆ రోజుల్లో ప్రదోషకాలంలో శివారాధన ప్రత్యేక ఫలితాలను ఇస్తుందని చెబుతారు.

‘ఓం నమః శివాయ’ అని ఒక్కసారి స్మరించినా శివుడు కరుణిస్తాడని భక్తులు నమ్ముతారు. భక్తితో సమర్పించిన ఒక పుష్పమే ఆయనకు ప్రీతికరం. ముఖ్యంగా ప్రదోషకాలంలో శివారాధన చేస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయని శివతత్వం చెబుతోంది.

ప్రదోషం అంటే పాప నిర్మూలన. మనం తెలిసీ తెలియక చేసిన పాపకర్మలు జీవనప్రయాణంలో అడ్డంకులుగా మారుతాయి. ఆ ప్రతిబంధకాలను తొలగించాలంటే పుణ్యకర్మలు అవసరం. అందుకే ప్రదోషకాలంలో శివుని స్మరించడం ద్వారా మన పాపకర్మల ఫలితాన్ని స్వీకరించి కష్టాలను తొలగిస్తాడని భక్తుల నమ్మకం.

Show Full Article
Print Article
Next Story
More Stories