
LIVE UPDATES
శ్రీకాకుళం డయేరియా వ్యాప్తి రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారం ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఏపీ , తెలంగాణా తాజా వార్తలు ఎప్పటికప్పుడు..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ స్థాయిలో వస్తున్న తాజా వార్తలను ఎప్పటికప్పుడు మీముందుంచుతుంది HMTV Live. ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళంలో డయేరియా కేసులు ఈరోజు పెద్ద అంశంగా మారాయి. అదేవిధంగా రాజమహేంద్రవరంలో కల్తీపాలు తాగి ఆరుగురు మృతి చెందడం ఆందోళన రేకెత్తిస్తోంది. తెలంగాణాలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర వద్ద చెట్లను నరికివేసిన ఉదంతం రాజకీయంగా విమర్శలతో హోరెత్తిపోతోంది . ఇలానే ఎన్నో విశేషాలను ఎప్పటికప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు .
Live Updates
- 25 Feb 2026 12:05 PM GMT
గ్యాస్ సిలెండర్ పేలుడు . . ఇల్లు ధ్వంసం
పెద్దపల్లి జిల్లా న్యూస్:
కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారంలో గ్యాస్ సిలిండర్ గ్యాస్ లీకై మంటలు
మండల అశోక్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఘటన
సిలిండర్ ఎగిరి పెంకుటిల్లు పైకప్పును ఢీ కొట్టింది
ప్రమాదంలో పెంకుటిల్లు ధ్వంసం, బియ్యం, ఫ్రిడ్జ్, నిత్యవసర వస్తువులు దగ్ధం.. రూ. 1.50 లక్షల ఆస్తి నష్టం.
- 25 Feb 2026 12:04 PM GMT
బాల్యవివాహాలు చేసినా ప్రోత్సహించినా కఠిన చర్యలు
హనుమకొండ న్యూస్:
బాల్యవివాహాలను చేసినా... ప్రోత్సహించినా చట్టపరమైన చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు. బాల్యవివాహాల నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ షేర్ ఎన్టీవో, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వరంగల్ విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన ప్రచార రథాన్ని వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
- 25 Feb 2026 11:03 AM GMT
డయేరియా పరిస్థితిపై శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ కామెంట్స్
- ఇలాంటి సమయంలో వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారు
- నలుగురు చనిపోయారని ధర్మాన ప్రసాదరావు చెప్పడం హాస్యాస్పదం
- డయేరియాతో చనిపోయారు అంటున్న ఆ నలుగురి వివరాలు ఇవ్వండి
- ఇతర కారణాలతో చనిపోయిన వారిని కూడా డయేరియా పరిధిలోకి తీసుకురావడం కరెక్ట్ కాదు
- ఎప్పుడు రాని ధర్మాన ఇప్పుడు వీధిలో తిరుగుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారైనా ఆయన రోడ్డుపైకి వచ్చారా ?
- ప్రభుత్వం చర్యలతో స్థానికలంతా చాలా ఆనందంగా ఉన్నారు
- 25 Feb 2026 11:00 AM GMT
డయేరియా పరిస్థితిపై శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ కామెంట్స్
- శ్రీకాకుళం పట్టణంలో డయేరియా కంట్రోల్లోనే ఉంది
- ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటున్నాం
- ఇప్పటివరకు 65 మందికి మాత్రమే డయేరియా సోకింది
- డయేరియా స్ప్రెడ్ అయితే వందల కొద్ది కేసులు బయటపడి ఉండేది
- అధికారులు వెంటనే స్పందించి డయేరియాను కంట్రోల్ చేశారు
- 25 Feb 2026 10:59 AM GMT
నెల్లూరు జిల్లాలో కారు ప్రమాదం.. ఒకరి మృతి
- చేజర్ల మండలం ఆదురుపల్లి గురుకుల పాఠశాల వద్ద చెట్టును ఢీకొన్న కారు.
- ప్రమాదంలో ఒకరు మృతి.. మరొకరి పరిస్థితి విషమం.
- బాధితుణ్ణి 108 లో ఆసుపత్రికి తరలించిన స్థానికులు
- 25 Feb 2026 10:41 AM GMT
మండలి చైర్మన్ మోషెన్ రాజు ను కలిసి తన వివరణ ఇచ్చిన మండలి చైర్మన్ జయ మంగళం వెంకట రమణ
- ఎవరైనా మీ ఎదుట వేరే పార్టీ కండువా కప్పుకొని కనపడితేనే మీరు సస్పెండ్ చేయవచ్చు.
- అలాంటిది నా రాజీనామా విషయంలో మీరు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదనీ చైర్మన్ ని ప్రశ్నించితిన్ వెంకటరమణ
- మిమ్మల్ని ఎవరైనా ప్రలోభ పెట్టారా లేక రాజీనామా చేయమని బెదిరించారా అని వెంకటరమణను అడిగిన మండలి చైర్మన్.
- అలాంటిదేమీ లేదు నేను స్వచ్ఛందంగానే వైసీపీ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాననీ తెలిపిన జయ మంగళం.
- 25 Feb 2026 10:40 AM GMT
మండలి చైర్మన్ మోషెన్ రాజు ను కలిసి తన వివరణ ఇచ్చిన మండలి చైర్మన్ జయ మంగళం వెంకట రమణ
- తన రాజీనామా ఆమోదించమని కోరిన వెంకట రమణ
- తాను వైసిపికి రాజీనామా చేసి జనసేనలో చేరినట్లు శాసనమండలి చైర్మన్ కు వివరించిన వెంకటరమణ
- తాను ఇప్పటికే జనసేన పార్టీలో అధికారికంగా జాయిన్ అయినట్టు స్పష్టం చేసిన వెంకటరమణ
- 25 Feb 2026 10:10 AM GMT
అసెంబ్లీ లాబి.. మడకశిర ఎమ్మెల్యే రాజు చిట్ చాట్
- మడకశిర పంట పొలాల్లో పేలుడు పదార్దాలు దొరికిన వైనంపై స్పందించిన ఎమ్మెల్యే MS రాజు
- లీగల్ పేలుడు పదార్దాలలో పని చేసే వ్యక్తి ఇల్లీగల్ గా చేస్తున్నాడని సమాచారం తెలిసింది
- దీనికి అతని బంధువు ఒక హోమ్ గార్డ్ సహకరించారు
- వాళ్ళిద్దరి మీద కేసు నమోదు చేస్తారు.
- 25 Feb 2026 10:06 AM GMT
అసెంబ్లీలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చిట్ చాట్...
- విశాఖ పట్నం లో త్వరలో ల్యాబ్ ను ప్రారంభిస్తాం.గుంటూరు,తిరుపతి లో ప్రాసెస్ లో ఉంది.
- తిరుమలలో టిటిడి సహకారం తో ల్యాబ్ ను ఇప్పటికే ఏర్పాటు చేసాము.
- వీలైంత త్వరగా కల్తీ నియంత్రణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తాం.
- 25 Feb 2026 10:04 AM GMT
అసెంబ్లీలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చిట్ చాట్
- ప్రస్తుతం ఆహార భద్రత అధికారులు తనిఖీలు చేసిన తర్వాత స్వీకరించిన శాంపిల్స్ ని హైదరాబాద్ పంపించాల్సి వస్తోంది.
- 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ముగియడంతో పరీక్షల కోసం పైసలు కట్టాల్సిన పరిస్థితి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




