టెక్నోపెయింట్స్ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా సచిన్ టెండూల్కర్

టెక్నోపెయింట్స్ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా సచిన్ టెండూల్కర్
x
Highlights

ప్రముఖ పెయింటింగ్ అండ్ పెయింటింగ్ సర్వీసెస్ కంపెనీ టెక్నోపెయింట్స్ తన నూతన ప్రచారకర్తగా “గాడ్ ఆఫ్ క్రికెట్” సచిన్ టెండూల్కర్ ను నియమించింది.

ప్రముఖ పెయింటింగ్ అండ్ పెయింటింగ్ సర్వీసెస్ కంపెనీ టెక్నోపెయింట్స్ తన నూతన ప్రచారకర్తగా “గాడ్ ఆఫ్ క్రికెట్” సచిన్ టెండూల్కర్ ను నియమించింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపరిచితమైన ఈ కంపెనీ, తన వ్యాపార విస్తరణలో భాగంగా పాన్ ఇండియా సేల్స్, ఆపరేషన్స్ మరియు రిటైల్ రంగంలో కొత్త ఫ్రాంచైజీలను ఏర్పాటుచేస్తోంది. దాంతో, దేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు ప్రాంతాల్లో బ్రాండ్ మరింత చేరువ కావడానికి సచిన్ టెండూల్కర్ ని బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకున్నట్లు తెలిపింది.

గురువారం ముంబైలో రెండు ప్రత్యేక ప్రచార చిత్రాలు చిత్రీకరించబడినవి. ఈ యాడ్ ఫిల్మ్స్‌ని ప్రముఖ యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో రూపొందించారని కంపెనీ తెలిపింది. సుజిత్ ఇటీవల ఓజీ చిత్రం ద్వారా ఇండస్ట్రీ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.

కంపెనీ చైర్మన్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ప్రచార చిత్రాలు త్వరలో దేశంలోని అన్ని ప్రముఖ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా విడుదల కానున్నట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories