2025 TVS Apache RR 310: యువతను ఊర్రూతలూగించే బైక్.. కొత్తగా టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310.. ఆహా అనేలా ఫీచర్లు, లుక్ కూడా అదిరిందయ్యా..!

2025 TVS Apache RR 310: యువతను ఊర్రూతలూగించే బైక్.. కొత్తగా టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310.. ఆహా అనేలా ఫీచర్లు, లుక్ కూడా అదిరిందయ్యా..!
x
Highlights

2025 TVS Apache RR 310: టీవీఎస్ మోటార్ కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ మోటార్‌సైకిల్ 'అపాచీ ఆర్ఆర్ 310' కొత్త అప్‌డేటెడ్ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది.

2025 TVS Apache RR 310: టీవీఎస్ మోటార్ కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ మోటార్‌సైకిల్ 'అపాచీ ఆర్ఆర్ 310' కొత్త అప్‌డేటెడ్ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. కొత్త ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ బైక్‌‌ని కంపెనీ OBD-2B ప్రమాణాలతో అప్‌డేట్ చేసిన ఇంజిన్‌ను ఉపయోగించింది. బైక్ పనితీరు మునుపటి కంటే మరింత మెరుగుపరిచిందని కంపెనీ పేర్కొంది. ఇది కాకుండా, కంపెనీ బైక్‌లో కొన్ని చిన్న మార్పులు కూడా చేసింది, దీని కారణంగా ఇది మునుపటి మోడల్ కంటే మెరుగ్గా మారింది.

2025 TVS Apache RR 310 Colour Variants And Price

ఈ బైక్‌లో టీవీఎస్ ఛాంపియన్‌షిప్ రేస్ బైక్ ఆధారంగా కొత్త సెపాంగ్ బ్లూ రేస్ రెప్లికా కలర్ స్కీమ్ కూడా ఉంది. ఈ మోటార్ సైకిల్ 3 స్టాండర్డ్ వేరియంట్లు, 3 బిల్ట్ టు ఆర్డర్ (BTO) కస్టమైజేషన్ కిట్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. క్విక్‌షిఫ్టర్ లేని రెడ్ వేరియంట్ ధర రూ.2,77,999 కాగా, క్విక్‌షిఫ్టర్‌తో కూడిన రెడ్ వేరియంట్ రూ.2,94,999కి లభిస్తుంది.

బాంబర్ గ్రే కలర్ ఆప్షన్ ధర రూ. 2,99,999. దీనితో పాటు, BTO కిట్ ధరలో డైనమిక్ కిట్ రూ. 18,000, డైనమిక్ ప్రో కిట్ రూ. 16,000, రేస్ రెప్లికా కలర్ స్కీమ్ రూ. 10,000 ఉంటాయి. ఈ బైక్ అధికారిక బుకింగ్‌ను కంపెనీ ప్రారంభించింది, దీనిని కంపెనీ అధికారిక వెబ్‌సైట్, అధీకృత డీలర్‌షిప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

2025 TVS Apache RR 310 Riding Modes

ఈ మోటార్ సైకిల్‌లో రైడర్ కంట్రోల్‌ను మెరుగుపరచడానికి దూకుడుగా ఉండే పూర్తి-ఫెయిర్డ్ డిజైన్, ట్రాక్-సెంట్రిక్ ఎర్గోనామిక్స్‌ అందించారు. ఈ బైక్‌లో 4 విభిన్న రైడింగ్ మోడ్‌లు కూడా ఉన్నాయి. ఇందులో ట్రాక్, స్పోర్ట్, అర్బన్, రెయిన్ ఉన్నాయి. వివిధ రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా మెరుగైన పనితీరు కోసం ఈ రైడింగ్ మోడ్‌లను ఉపయోగించవచ్చు.

2025 TVS Apache RR 310 Engine

ఈ మోటార్ సైకిల్‌‌లో 312 సీసీ రివర్స్-ఇంక్లైన్డ్ DOHC ఇంజిన్‌ ఉంది. ఈ ఇంజిన్ 9,800 ఆర్‌పిఎమ్ వద్ద 38 పిఎస్ పవర్, 7,900 ఆర్‌పిఎమ్ వద్ద 29 న్యూటన్ మీటర్లు గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో జతచేసి ఉంటుంది. ఈ బైక్ 2.82 సెకన్లలో 0 నుండి 60 కిమీ/గం వేగాన్ని, 6.74 సెకన్లలో 0 నుండి 100 కిమీ/గం వేగాన్ని అందుకోగలదని కంపెనీ పేర్కొంది. దీని గరిష్ట వేగం గంటకు 164 కి.మీ.

2025 TVS Apache RR 310 Specifications

అపాచీ ఆర్ఆర్ 310లో సీక్వెన్షియల్ టర్న్ సిగ్నల్ లాంప్స్, కార్నరింగ్ డ్రాగ్ టార్క్ కంట్రోల్ వంటి కొన్ని సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఇతర ఫీచర్స్‌లో లాంచ్ కంట్రోల్, మల్టీ-లాంగ్వేజ్ సపోర్ట్‌తో రేస్ కంప్యూటర్, 8-స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. అలానే 5-అంగుళాల TFT స్క్రీన్‌ కూడా ఉంది. ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో అల్యూమినియం డై-కాస్ట్ స్వింగార్మ్ సస్పెన్షన్ ఉన్నాయి. బైక్ 17-అంగుళాల అద్భుతమైన మిచెలిన్ టైర్లతో వస్తుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories