Gold, Silver Price Today: తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold, Silver Price Today: బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి.

Kranthi
Published on: 13 July 2021 7:05 AM IST
24 Carat Gold Rate Today 13 07 2021 in Hyderabad Silver Price Today in Vijayawada Amaravathi Delhi
X

Gold, Silver Price Today: (File Image)

Gold Price Today: గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తుండగా నేడు మాత్రం కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇండియాలో కరోనా తగ్గిపోయినట్లే అనే భావన దేశ ప్రజల్లో కనిపిస్తోంది. అందువల్ల... బంగారంపై పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. కేసులు మళ్లీ పెరిగే పరిస్థితి వస్తే మాత్రం బంగారం ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. తాజాగా అంతర్జాతీయ, దేశీయ పరిస్థితులను బట్టీ... బంగారం ధరలు పెరిగేలా ఉండగా... స్టాక్ మార్కె్ట్లు నష్టాల బాట పట్టేలా కనిపిస్తున్నాయని నిపుణులు అంచానా వేస్తున్నారు. తాజాగా బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర 20 గ్రాములు రూ.44,650 లు ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 10 గ్రాములు ధర రూ.48,720 కొనసాగుతోంది.

దేశంలోని వివిధ నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,800 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ50,850 లు ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,710లు ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,710 ల వద్ద మార్కెట్ కొనసాగుతుంది.చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం రూ. 45,260గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 49,380గా నమోదైంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 44,750 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 48,820గా ట్రేడ్ అవుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,750గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,820 వద్ద ఉండగా, విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,750 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 48,820 లు ట్రేడ్ అవుతోంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 44,750 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 48,820గా కొనసాగుతోంది.

వెండి ధరలు...

ప్రపంచంలో, దేశంలో చోటు చేసుకుంటున్న పలు ఆర్థిక, పలు పరిణామాల వల్ల బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కామన్ అయిపోయాయి. నేడు బంగారం, వెండి ధరలు కాస్త తగ్గుముఖంపట్టాయి. తాజాగా ఇక వెండి ధరల్లో కూడా దేశీయంగా రూ.300లు తగ్గి కేజీ వెండి ధర... రూ.73,800 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని వివిధ నగరాల్లో...

దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 69,300 వద్ద కొనసాగుతోంది. ఆర్థిక రాజధాని ముంబయిలోనూ కిలో వెండి ధర రూ. 69,300గా నమోదైంది.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 73,100గా ఉంది. బెంగళూరులో కిలో వెండి రూ. 69,300గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో కిలో వెండి రూ. 73,800గా ఉండగా, విజయవాడలో వెండి రూ. 73,900 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలోనూ కిలో వెండి ధర రూ. 73,800ల వద్ద కొనసాగుతోంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 13-07-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Kranthi

Kranthi

Next Story