Ceasefire: అంబానీ, అదానీల అదృష్టాన్ని మార్చిన కాల్పుల విరమణ.. 5 రోజుల్లో ఎంత సంపాదించారో తెలుసా?

Ceasefire
x

Ceasefire: అంబానీ, అదానీల అదృష్టాన్ని మార్చిన కాల్పుల విరమణ.. 5 రోజుల్లో ఎంత సంపాదించారో తెలుసా?

Highlights

Ceasefire: భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత ఆసియాలోని ఇద్దరు అతిపెద్ద వ్యాపారవేత్తలైన ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీల అదృష్టం ఒక్కసారిగా మారిపోయింది.

Ceasefire: భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత ఆసియాలోని ఇద్దరు అతిపెద్ద వ్యాపారవేత్తలైన ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీల అదృష్టం ఒక్కసారిగా మారిపోయింది. విశేషం ఏంటంటే.. ముఖేష్ అంబానీ ఏకంగా 100 బిలియన్ డాలర్ల లేదా అంతకంటే ఎక్కువ సంపద కలిగిన బిలియనీర్ల గ్రూప్‌లో చేరిపోయారు. మరోవైపు గౌతమ్ అదానీ ప్రపంచంలోని టాప్ 20 కుబేరుల జాబితాలో స్థానం సంపాదించారు. బ్లూమ్‌బెర్గ్ గణాంకాలను పరిశీలిస్తే ఆసియాలోని అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ నికర విలువ కేవలం 5 రోజుల్లో 6 బిలియన్ డాలర్లు పెరిగింది. అదే సమయంలో ఆసియాలోని రెండో అత్యంత ధనవంతుడైన గౌతమ్ అదానీ నికర విలువ 9.2 బిలియన్ డాలర్లు పెరిగింది. ఇద్దరు బిలియనీర్ల నికర విలువ ఇప్పుడు ఎంత ఉందో తెలుసుకుందాం.

ముఖేష్ అంబానీ సంపద ఎంత పెరిగిందంటే

మొదట ముఖేష్ అంబానీ గురించి మాట్లాడితే.. గత ఐదు ట్రేడింగ్ రోజుల్లో ఆయన నికర విలువ భారీగా పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం మే 9న ముఖేష్ అంబానీ మొత్తం నికర విలువ 99 బిలియన్ డాలర్లు ఉండగా అది మే 16 నాటికి 105 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అంటే కేవలం 5 ట్రేడింగ్ రోజుల్లో ముఖేష్ అంబానీ నికర విలువ 6 బిలియన్ డాలర్లు అంటే 51 వేల కోట్ల రూపాయలకు పైగా పెరిగింది. దీంతో ముఖేష్ అంబానీ 100 బిలియన్ డాలర్ల నికర విలువ కలిగిన ఎలైట్ గ్రూప్‌లో చేరిపోయారు. కాల్పుల విరమణ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు బాగా పెరగడం వల్లనే ఆయన నికర విలువ పెరిగిందని నిపుణులు భావిస్తున్నారు.

పెరిగిన అదానీ నికర విలువ

మరోవైపు గౌతమ్ అదానీ నికర విలువ కూడా బాగా పెరిగింది. విశేషం ఏంటంటే, ఐదు ట్రేడింగ్ రోజుల్లో అదానీ నికర విలువ అంబానీ కంటే ఎక్కువగా పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం మే 9న గౌతమ్ అదానీ నికర విలువ 74.4 బిలియన్ డాలర్లు ఉండగా, అది మే 16 నాటికి 83.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అంటే గౌతమ్ అదానీ నికర విలువ 9.2 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 79 వేల కోట్ల రూపాయలు పెరిగింది. అంతేకాకుండా ఆయన ప్రపంచంలోని టాప్ 20 కుబేరుల జాబితాలో కూడా చేరారు. ఇదే వేగంతో ఆయన ముందుకు సాగితే త్వరలోనే 100 బిలియన్ డాలర్ల మార్కును కూడా చేరుకునే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories