Nvidia Market Value: 6 నెలల్లో 100% లాభాలు.. ఈ AI కంపెనీ మార్కెట్ విలువ తెలిస్తే షాక్ కావాల్సిందే!

Nvidia Market Value: 6 నెలల్లో 100% లాభాలు.. ఈ AI కంపెనీ మార్కెట్ విలువ తెలిస్తే షాక్ కావాల్సిందే!
x
Highlights

Nvidia Market Value: ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది.. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence).

Nvidia Market Value: ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది.. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence). గడిచిన కొద్ది నెలలుగా వాల్ స్ట్రీట్ (అమెరికా స్టాక్ మార్కెట్)ను AI తుపానులా చుట్టేసింది. ముఖ్యంగా చిప్స్ తయారు చేసే Nvidia వంటి కంపెనీలు సాధిస్తున్న వృద్ధిని చూసి ఆర్థిక నిపుణులే ఆశ్చర్యపోతున్నారు. AI రంగంలో అగ్రగామిగా ఉన్న ఎన్విడియా (Nvidia) కంపెనీ మార్కెట్ విలువ దాదాపు $5 ట్రిలియన్లకు చేరుకుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీలలో ఒకటిగా నిలిచింది. బంగారం మొత్తం విలువ సుమారు $28 ట్రిలియన్లు ఉంటే, దాని తర్వాత అత్యంత విలువైన ఆస్తిగా ఇప్పుడు ఈ కంపెనీ షేర్లే కనిపిస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గడిచిన ఆరు నెలల్లోనే ఈ కంపెనీ స్టాక్ 100 శాతానికి పైగా లాభాలను అందించడం విశేషం.

ట్రిలియన్ డాలర్ల క్లబ్..

కేవలం చిప్ కంపెనీలే కాదు, మన నిత్య జీవితంలో భాగమైన ఆపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ (ఆల్ఫాబెట్) వంటి దిగ్గజాలు కూడా ఇప్పుడు AI బాట పట్టాయి. ఈ మూడు కంపెనీల మొత్తం మార్కెట్ విలువ $11.33 ట్రిలియన్ల పైమాటే. ప్రతి కంపెనీ తమ సొంత AI ప్రోగ్రామ్‌లను ప్రచారం చేస్తూ, భవిష్యత్తులో AI ఒక 'కొత్త విద్యుత్తు' (New Electricity) లాగా ప్రతి రంగానికి శక్తినిస్తుందని నమ్ముతున్నాయి. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా - చైనా AI అభివృద్ధి కోసం భారీగా నిధులు కేటాయిస్తున్నాయి. ఇటీవల డొనాల్డ్ ట్రంప్, జి జిన్‌పింగ్ మధ్య జరిగిన భేటీలో కూడా ఈ అంశం చర్చకు రావడం దీని ప్రాధాన్యతను తెలియజేస్తోంది. 2026 నాటికి ప్రపంచవ్యాప్తంగా AI పై పెట్టే ఖర్చు $300 బిలియన్లు దాటుతుందని అంచనా.

భవిష్యత్తు ఎలా ఉండబోతోంది..

వెస్టెడ్ ఫైనాన్స్ CEO విరామ్ షా ఏఐ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ.. 2030 నాటికి AI ప్రపంచ జీడీపీకి $15 ట్రిలియన్ల అదనపు విలువను జోడించగలదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం AI చిప్‌లు, క్లౌడ్ స్టోరేజ్ కోసం ఉన్న డిమాండ్ కంపెనీలకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతోందని చెప్పారు. లాభాలు బాగున్నప్పటికీ, కంపెనీల వాల్యుయేషన్లు (విలువలు) వాస్తవిక లాభాల కంటే చాలా వేగంగా పెరిగిపోతున్నాయని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో మార్కెట్‌లో ఒడిదుడుకులు ఉండవచ్చని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories