8th Pay Commission : ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 కాదా? ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్టేనా?

8th Pay Commission
x

8th Pay Commission: ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 కాదా? ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్టేనా?

Highlights

8th Pay Commission: కొత్త వేతన సంఘానికి ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటి నుండి దీనికి సంబంధించిన కొత్త అప్‌డేట్‌లు వెలుగులోకి వస్తున్నాయి. 8వ వేతన సంఘం వచ్చే ఏడాది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

8th Pay Commission: కొత్త వేతన సంఘానికి ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటి నుండి దీనికి సంబంధించిన కొత్త అప్‌డేట్‌లు వెలుగులోకి వస్తున్నాయి. 8వ వేతన సంఘం వచ్చే ఏడాది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కరువు భత్యాన్ని (DA) పెంచింది. దీంతో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 8వ వేతన సంఘంలో ప్రభుత్వం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను పెంచకపోవచ్చు. దీని వెనుక ఉన్న కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఎన్‌డిటివి ప్రాఫిట్ నివేదిక ప్రకారం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక వేతనంలో డిఎలో 50 శాతాన్ని విలీనం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఒకవేళ ఇది నిజమైతే, 8వ వేతన సంఘంలో అధిక ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కోసం డిమాండ్ తగ్గుతుంది. ప్రభుత్వం కూడా తక్కువ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను పెంచే అవకాశం ఉంది. దీనికి కారణం ప్రస్తుతం ఉద్యోగుల ప్రాథమిక వేతనం రూ.18,000. డిఎ విలీనం తర్వాత అది రూ.27,000కు పెరుగుతుంది. వేతన సంఘం అమల్లోకి రాకముందే జీతంలో పెరుగుదల ఉంటుంది. కాబట్టి ఇది ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ డిమాండ్‌పై ప్రభావం చూపుతుంది.

డిఎ విలీనం అయ్యే అవకాశం

కేంద్ర ప్రభుత్వం 5వ వేతన సంఘం ప్రకారం.. డిఎ 50 శాతం కంటే ఎక్కువ దాటితే దానిని ప్రాథమిక వేతనంతో కలపాలని నియమం పెట్టింది. ప్రభుత్వం 2004లో అలా చేసింది కూడా. అయితే, ఈ విధానాన్ని 6వ వేతన సంఘంలో పరిగణించలేదు. 7వ వేతన సంఘంలో కూడా దీనిని పరిగణించలేదు. కానీ ఈసారి ప్రభుత్వం డిఎను ప్రాథమిక వేతనంతో విలీనం చేస్తుందని అంచనాలు ఉన్నాయి. ఒకవేళ ఈసారి డిఎ మరియు ప్రాథమిక వేతనాన్ని కలిపితే, ఉద్యోగుల ప్రాథమిక వేతనం పెరుగుతుంది. దీనివల్ల ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎక్కువగా పెరిగే అవకాశంపై ప్రభావం పడుతుంది.

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది ఒక గుణకం. దీని ద్వారా ప్రభుత్వం ప్రస్తుత జీతం ఆధారంగా, రాబోయే వేతన సంఘంలో జీతాన్ని పెంచుతుంది. అయితే, జీతం పెరగడం కేవలం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై మాత్రమే ఆధారపడి ఉండదు. అయినప్పటికీ, ఇది జీతం పెరుగుదలపై ప్రభావం చూపుతుంది. ప్రభుత్వం 7వ వేతన సంఘంలో 2.57 ఫిట్‌మెంట్‌ను అమలు చేసింది. అయితే ఈసారి ఉద్యోగులు 2.86 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories