Aadhaar Safety Tips: మీ ఆధార్‌ సేఫ్‌గా ఉందా? బయోమెట్రిక్ మోసాలకు ఇలా చెక్ పెట్టండి!

Aadhaar Safety Tips: మీ ఆధార్‌ సేఫ్‌గా ఉందా?  బయోమెట్రిక్ మోసాలకు ఇలా చెక్ పెట్టండి!
x

Aadhaar Safety Tips: మీ ఆధార్‌ సేఫ్‌గా ఉందా? బయోమెట్రిక్ మోసాలకు ఇలా చెక్ పెట్టండి!

Highlights

ప్రస్తుతం మన జీవితంలో 'ఆధార్' అనేది కేవలం ఒక గుర్తింపు కార్డు మాత్రమే కాదు.. మన జీవితానికి చాలా చాలా కీలకం.

ప్రస్తుతం మన జీవితంలో 'ఆధార్' అనేది కేవలం ఒక గుర్తింపు కార్డు మాత్రమే కాదు.. మన జీవితానికి చాలా చాలా కీలకం. ఈ రోజుల్లో బ్యాంక్ ఖాతాలు, పాన్ కార్డు, ఈపీఎఫ్ (EPF), గ్యాస్ సబ్సిడీ వంటి ప్రతి సేవకూ ఆధార్ కీలకంగా మారింది. మన రోజు వారి జీవితంలో ఆధార్ వినియోగం పెరిగిన క్రమంలో పలు చిక్కులకు ఆస్కారం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆధార్ వినియోగం పెరుతున్న కొద్దీ ఆధార్‌లోని మీ వేలిముద్రలు, ఐరిస్ డేటాను దొంగిలించి బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేసే ముఠాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయని చెబుతున్నారు. ఇలాంటి 'బయోమెట్రిక్' మోసాల నుంచి తప్పించుకోవడానికి UIDAI ఒక అద్భుతమైన భద్రతా ఫీచర్‌ను అందిస్తోంది. అదే 'ఆధార్ బయోమెట్రిక్ లాక్'.

బయోమెట్రిక్ లాక్ అంటే ఏమిటి?

సాధారణంగా మనం దుకాణాల్లో లేదా బ్యాంకింగ్ కరస్పాండెంట్ల వద్ద వేలిముద్ర వేసి డబ్బులు డ్రా చేస్తుంటాం (AePS విధానం). బయోమెట్రిక్ లాక్ ఫీచర్‌ను మీరు ఎనేబుల్ చేసుకుంటే.. మీ అనుమతి లేకుండా, అంటే మీరు మళ్లీ దాన్ని అన్‌లాక్ చేసే వరకు ఎవరూ మీ వేలిముద్ర లేదా ఐరిస్ డేటాను ఉపయోగించి లావాదేవీలు చేయలేరు. ఇది మీ ఆధార్‌కు ఒక 'డిజిటల్ తాళం' లాంటిది. చాలా మంది బయోమెట్రిక్ లాక్ వేస్తే అన్ని సేవలు ఆగిపోతాయని భయపడుతుంటారు. కానీ అది నిజం కాదు. ఎప్పటిలాగే యూపీఐ (UPI), నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డ్ పేమెంట్స్, మొబైల్‌కు వచ్చే OTP ఆధారిత ఆధార్ ధృవీకరణలు పనిచేస్తాయి. బయోమెట్రిక్ లాక్ వేస్తే కేవలం వేలిముద్ర (Fingerprint), ఐరిస్ (Iris) ద్వారా జరిగే సేవలు మాత్రమే నిలిచిపోతాయి.

లాక్ చేయడం సింపుల్..

UIDAI వెబ్‌సైట్ లేదా mAadhaar యాప్‌లోకి వెళ్లండి.

మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.

మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే OTPని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.

మెనూలో ఉన్న 'Lock/Unlock Biometrics' ఆప్షన్‌ను ఎంచుకుని, దానిని యాక్టివేట్ చేయండి.

మీరు ఏదైనా రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కో లేదా బ్యాంక్‌కో వెళ్ళినప్పుడు బయోమెట్రిక్ అవసరమైతే, మీరు యాప్ ద్వారా మీ ఆధార్ బయోమెట్రిక్ లాక్‌ను తాత్కాలికంగా అన్‌లాక్ కూడా చేయవచ్చు. పని పూర్తయిన కాసేపటికే అది ఆటోమేటిక్‌గా మళ్లీ లాక్ అయిపోతుంది. కేవలం లాక్ చేయడమే కాకుండా, పలు జాగ్రత్తలు కూడా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ ఆధార్ ఎక్కడెక్కడ వాడారో తెలుసుకోవడానికి UIDAI వెబ్‌సైట్‌లో 'Authentication History'ని తరచుగా తనిఖీ చేయాలి. అలాగే మీ ఆధార్‌కు సంబంధించిన ఓటీపీలను ఎవరికీ చెప్పకూడదు. కేవలం గుర్తింపు కోసం ఆధార్ ఇవ్వాల్సి వస్తే, ఆధార్ నంబర్ కనిపించని 'మాస్క్డ్ ఆధార్'ను ఉపయోగించాలి. అనవసరమైన చోట్ల ఆధార్ జిరాక్స్ కాపీలు ఇవ్వడం మానుకోవాలి.

ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్లు మీ వేలిముద్రలను క్లోనింగ్ చేసి డబ్బులు కాజేసే ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి సమయాల్లో 'బయోమెట్రిక్ లాక్' అనేది మీ ఆధార్ కార్డ్‌కు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. తక్కువ శ్రమతో మీ కష్టార్జితాన్ని కాపాడుకోవడానికి వెంటనే మీ ఆధార్‌ను లాక్ చేసుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories