
Airtel Offer: ఎయిర్‌టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్.. రూ.449 కే అన్‌లిమిటెడ్ డేటా.. ఫ్రీగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు!
ఎయిర్‌టెల్ తన పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం ఒక అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది.
ఎయిర్‌టెల్ తన పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం ఒక అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న తన అన్ని పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లకు 'అపరిమిత డేటా' సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తాజాగా ఎయిర్‌టెల్ ప్రకటించింది. గతంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ ఆఫర్, ఇప్పుడు అన్ని సర్కిల్‌లకు వర్తిస్తుందని వెల్లడించింది. ఎయిర్‌టెల్ ప్రకటించిన ఈ స్పెషల్ ఆఫర్‌తో కస్టమర్లకు కలిగే బెనిఫిట్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రయోజనాలు ఇవే..
ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్‌లో స్టార్టింగ్ ప్లాన్ రూ.449. దీనిపై అదనంగా 18% GST వర్తిస్తుంది. ఈ ప్లాన్‌తో రోజుకు 50GB చొప్పున నెలకు అపరిమిత డేటా వస్తుంది. అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలు పొందవచ్చు. దీంతో పాటు అదనపు బెనిఫిట్స్ కూడా వస్తున్నాయి. ఈ ప్లాన్‌తో 100GB గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ కూడా వస్తుంది. దీంతో పాటు 3 నెలల పాటు ఉచితంగా జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కూడా వస్తుంది. అలాగే ఏడాది పాటు అడోబ్ ప్రీమియం యాక్సెస్ అందుబాటులో ఉంటుంది. వీటితో పాటుగా ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే సదుపాయం కూడా ఉంటుంది.
ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్‌లో ఫ్యామిలీ ప్లాన్ అనే మరొక ప్లాన్‌ను కూడా యూజర్స్ కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది రూ.699 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ప్లాన్ కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. దీనికి కూడా 18% GST చెల్లించాల్సి ఉంటుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఒకే బిల్లుపై ఇద్దరు వ్యక్తులు 2 సిమ్ కార్డులు వాడుకోవచ్చు. ఈ ప్లాన్‌పై గతంలో 105GB వచ్చేది, కానీ కొత్త రూల్ ప్రకారం ఇప్పుడు అపరిమిత డేటా లభిస్తుంది. దీంతో అపరిమిత కాలింగ్, ఉచిత SMS సదుపాయం కూడా ఉంటుంది. నిజానికి పైన చెప్పిన రెండు ఆఫర్‌లకు కూడా అపరిమిత డేటా అని చెప్పినప్పటికీ, ఒక నెలలో గరిష్టంగా 300GB వరకు మాత్రమే హై-స్పీడ్ డేటాను వాడుకోవచ్చని కంపెనీ స్పష్టంగా పేర్కొంది. మీరు ఇంటర్నెట్ ఎక్కువగా వాడుతూ, అదనపు ఓటీటీ (OTT) ప్రయోజనాలు కోరుకునే వారైతే, ఈ ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు మీకు చక్కగా ఉపయోగపడుతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




