
Amazon Summer Sale: పాత ఏసీ ఇస్తే కొత్త ఏసీపై బంపర్ డిస్కౌంట్.. అమెజాన్ హోమ్ అప్లయన్సెస్ సేల్ ఫుల్ డీటెయిల్స్ ఇవే!
Amazon Summer Sale: వేసవి కాలం రాకముందే ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాలో గృహోపకరణాలపై అదిరిపోయే ఆఫర్లు మొదలయ్యాయి.
Amazon Summer Sale: పాత ఏసీ ఇస్తే కొత్త ఏసీపై బంపర్ డిస్కౌంట్.. అమెజాన్ హోమ్ అప్లయన్సెస్ సేల్ ఫుల్ డీటెయిల్స్ ఇవే!
వేసవి కాలం రాకముందే ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాలో గృహోపకరణాలపై అదిరిపోయే ఆఫర్లు మొదలయ్యాయి. కొత్త ఏసీ లేదా ఫ్రిజ్ కొనాలనుకునే వారికి ఇది మంచి సమయం అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కామర్స్ దిగ్గజం హోమ్ అప్లయన్సెస్‌పై ప్రత్యేక డీల్స్ ప్రారంభించింది. కొన్ని ఉత్పత్తులపై ఏకంగా 65 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. అవి ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అమెజాన్ తన సేల్‌లో స్ప్లిట్ ఏసీలు, విండో ఏసీలతో పాటు పోర్టబుల్ ఏసీలను అందుబాటులో ఉంచింది. ఈ సేల్‌లో మీ గది పరిమాణాన్ని బట్టి 0.8 టన్ నుంచి 2 టన్ల వరకు అన్ని రకాల ఏసీలు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో ఏసీలను కొనుగోలు చేయాలని చూసే వారికి బ్యాంక్ కార్డ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ, ప్రత్యేక కూపన్ల ద్వారా ధరను మరింత తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. అలాగే మీకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా వర్తింది. మీ పాత ఏసీని ఇచ్చి కొత్తది కొనుగోలు చేస్తే భారీ మొత్తంలో తగ్గింపు పొందే అవకాశం ఉందన్నారు.
వాషింగ్ మెషీన్లు బడ్జెట్ ధరలోనే..
మీరు కొత్త వాషింగ్ మెషీన్ కోసం చూస్తున్నట్లయితే, అమెజాన్ సేల్‌లో మంచి ఆప్షన్లు ఉన్నాయి. ముఖ్యంగా ఎల్జీ (LG) వంటి బ్రాండెడ్ ఫ్రంట్-లోడ్ వాషింగ్ మెషీన్లు రూ.30,000 లోపు ధరకే లభిస్తున్నాయి. టాప్-లోడ్, సెమీ ఆటోమేటిక్ మెషీన్లపై కూడా ఆకర్షణీయమైన డీల్స్ ఉన్నాయి. అలాగే ఈ సేల్‌లో సింగిల్ డోర్, డబుల్ డోర్, సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. విద్యుత్ ఆదా చేసే 3-స్టార్, 5-స్టార్ రేటింగ్ కలిగిన ఫ్రిజ్‌లపై కూడా డిస్కౌంట్లు ఉన్నాయి. ఈ సేల్‌లో ఏసీలు, ఫ్రిజ్‌లే కాకుండా మైక్రోవేవ్ ఓవెన్లు, చిమ్నీలపై కూడా ప్రత్యేక తగ్గింపులు లభిస్తున్నాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




