Gmail to Zoho Mail: జీమెయిల్‌ నుంచి జోహోమెయిల్‌కి మారుతున్నారా? డేటా మిస్ కాకుండా ఇలా మారండి!

Gmail to Zoho Mail: జీమెయిల్‌ నుంచి జోహోమెయిల్‌కి మారుతున్నారా? డేటా మిస్ కాకుండా ఇలా మారండి!
x

Gmail to Zoho Mail: జీమెయిల్‌ నుంచి జోహోమెయిల్‌కి మారుతున్నారా? డేటా మిస్ కాకుండా ఇలా మారండి!

Highlights

Gmail to Zoho Mail: దేశీయ ఉత్పత్తులు, సేవలను వినియోగించాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు స్ఫూర్తితో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన జీమెయిల్...

Gmail to Zoho Mail: దేశీయ ఉత్పత్తులు, సేవలను వినియోగించాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు స్ఫూర్తితో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన జీమెయిల్ (Gmail) ఖాతా నుంచి దేశీయంగా అభివృద్ధి చేసిన జోహో మెయిల్‌ (Zoho Mail) సేవలకు మారారు. ఆయనతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా ఈ స్వదేశీ ప్లాట్‌ఫాం వైపు మొగ్గు చూపడంతో, జోహో పేరు మారుమోగుతోంది.

జోహో మెయిల్ ప్రత్యేకతలు:

జోహో వినియోగదారుల గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఇది ప్రకటనలు లేకుండా (Ad-free) సేవలను అందిస్తుంది. వ్యాపారాలు, నిపుణులకు ఉపయోగపడేలా కస్టమ్‌ డొమైన్ ఇమెయిల్స్‌, సులభమైన ఇంటర్‌ఫేస్, గోప్యతా రక్షణలతో ఈ ప్లాట్‌ఫాం ఆకట్టుకుంటోంది. తక్కువ ఖర్చుతోనే ప్రొఫెషనల్‌ స్థాయి టూల్స్‌ను అందిస్తూ, డిస్ట్రాక్షన్-ఫ్రీ ఇన్‌బాక్స్ అనుభవాన్ని కల్పిస్తుంది.

జీమెయిల్ నుంచి జోహో మెయిల్‌కు మారడం ఇలా:

జోహో మెయిల్‌కు మారడం చాలా సులభం. మీ పాత మెయిల్స్, ఫోల్డర్‌లు, కాంటాక్ట్‌లు ఏవీ కోల్పోకుండా సులభంగా మారే ప్రక్రియను ఇక్కడ చూడండి:

ఖాతా సృష్టించండి: గూగుల్ ప్లేస్టోర్/యాప్‌స్టోర్‌ నుంచి జోహో మెయిల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి. లేదా జోహోమెయిల్ వెబ్‌సైట్‌లో ఖాతా సృష్టించండి. మీ అవసరాన్ని బట్టి పర్సనల్‌ ఇమెయిల్‌ లేదా బిజినెస్‌ ఇమెయిల్‌ను ఎంచుకోండి.

IMAP ఎనేబుల్ చేయండి: మీ జీమెయిల్ ఖాతాలోకి వెళ్లి Settings > See all settings > Forwarding and POP/IMAP క్లిక్ చేసి, IMAPను ఎనేబుల్ చేయండి. దీని ద్వారా జోహో మెయిల్ డేటాను బదిలీ చేస్తుంది.

డేటా ఇంపోర్ట్ చేయండి: జోహో మెయిల్‌లో Settings > Import/Export ఎంపికను ఓపెన్ చేయండి. Migration Wizard ఉపయోగించి మీ జీమెయిల్ ఇమెయిల్స్‌, ఫోల్డర్లు, కాంటాక్ట్స్‌ అన్నీ ఇంపోర్ట్ చేయండి.

ఫార్వార్డింగ్ సెట్ చేయండి: కొత్తగా వచ్చే మెయిల్స్ కూడా జోహో ఖాతాకే రావాలంటే, జీమెయిల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Email forwarding ఎంపికలో మీ కొత్త Zoho Mail చిరునామాను నమోదు చేయండి.

Show Full Article
Print Article
Next Story
More Stories