April Bank Holidays: ఏప్రిల్‌ నెలలో బ్యాంకుల సెలవుల జాబితా.. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు బంద్‌?

April Bank Holidays: ఏప్రిల్‌ నెలలో బ్యాంకుల సెలవుల జాబితా.. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు బంద్‌?
x
Highlights

April Bank Holidays 2025 List: సాధారణంగా ఆర్‌బీఐ జారీ చేసినా క్యాలెండర్ ప్రకారం బ్యాంకులకు సెలవులు ఉంటాయి.

April Bank Holidays 2025 List: సాధారణంగా ఆర్‌బీఐ జారీ చేసినా క్యాలెండర్ ప్రకారం బ్యాంకులకు సెలవులు ఉంటాయి. దేశవ్యాప్తంగా ప్రతి ఆదివారం, రెండో శనివారం కూడా బ్యాంకులు పనిచేయవు. అయితే ఏప్రిల్ నెలలో బ్యాంకులో దాదాపు 15 రోజులపాటు బంద్ ఉండనున్నాయి. ఇవి ఆయా ప్రాంతాలను బట్టి ఉంటాయి. ఖాతాదారులు ముందుగానే బ్యాంకులు బంద్‌ ఉంటాయి తెలుసుకోవాలి.

ఇక ఏప్రిల్ 1వ తేదీన యాన్యువల్ ఇన్వెంటరీ (Annual Inventory) సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. ఇది ప్రతి ఏడాది జరుగుతుంది.. అంటే ఈరోజు ప్రత్యేకంగా వార్షిక ఖాతాలను మూసి వేస్తాయి బ్యాంకులు. ఈ నేపథ్యంలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.

ఏప్రిల్ 5 శనివారం బాబు జగ్జీవన్ జయంతి సందర్భంగా తెలంగాణలో బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఈయన స్వాతంత్ర సమరయోధుడు, దళిత నాయకుడు.

తెలంగాణ బ్యాంకు సెలవులు..

ఇక తెలంగాణలో ఏప్రిల్ 1, 5, 10, 14, 18 తేదీల్లో సెలవులు ఉంటాయి. ఇది కాకుండా ఏప్రిల్ 12, 26 రెండో, నాలుగో శనివారం కాబట్టి బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఇక ఏప్రిల్ 6,13, 20,27 ఆదివారాల రానున్నాయి. ఈ రోజుల్లో కూడా బ్యాంకులు పనిచేయవు. మొత్తంగా 11 రోజులు తెలంగాణ బ్యాంకులు పనిచేయవు.

దేశవ్యాప్తంగా సెలవులు..

ఏప్రిల్ 10వ తేదీ మహావీర్ జయంతి సందర్భంగా బ్యాంకులు బంద్ ఉంటాయి. ఈయన జైన మతానికి చెందిన 24వ తీర్థంకరుడు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో కూడా బ్యాంకులు బంద్ ఉంటాయి.

ఏప్రిల్ 12వ తేదీ రెండో శనివారం కాబట్టి బ్యాంకులకు సెలవు ఉంది. ఏప్రిల్ 13 ఆదివారం కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు సెలవు ఉంటుంది.

ఏప్రిల్ 14వ తేదీ బాబా బీమ్ రావు అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు సెలవు ఇది సోమవారం నాడు రానుంది.

ఏప్రిల్ 21వ తేదీ సోమవారం త్రిపురలో గరియా పూజ నిర్వహిస్తారు. ఆరోజు సెలవు ఉంటుంది. ఏప్రిల్ 29 పరుశురామ జయంతి హిమాచల్ ప్రదేశ్ లో బంద్, ఏప్రిల్ 30వ తేదీ అక్షయ తృతీయ సందర్భంగా కర్ణాటకలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories