Pushpa 2: అల్లు అర్జున్ పుష్ప 2 చూడటానికి బ్లింకిట్ డిస్కౌంట్ వోచర్‌.. ఎంత తగ్గింపు లభిస్తుందో తెలుసా ?

Pushpa 2
x

Pushpa 2: అల్లు అర్జున్ పుష్ప 2 చూడటానికి బ్లింకిట్ డిస్కౌంట్ వోచర్‌.. ఎంత తగ్గింపు లభిస్తుందో తెలుసా ?

Highlights

Pushpa 2: ఒక కిరాణా సర్వీస్ డెలివరీ సంస్థ ప్రస్తుతం ప్రజల హృదయాలను గెలుచుకున్న పుష్ప-2 చిత్రాన్ని మరింత మందికి చూపించేందుకు తన ప్రయత్నాన్ని మొదలు పెట్టింది.

Pushpa 2: ఒక కిరాణా సర్వీస్ డెలివరీ సంస్థ ప్రస్తుతం ప్రజల హృదయాలను గెలుచుకున్న పుష్ప-2 చిత్రాన్ని మరింత మందికి చూపించేందుకు తన ప్రయత్నాన్ని మొదలు పెట్టింది. అల్లు అర్జున్ చేసిన ఈ మ్యాజిక్ నార్త్ ఇండియన్ ఆడియన్స్‌పై కూడా బాగానే పని చేస్తోంది. దీన్ని మరింత పెంచడానికి, Zomato కిరాణా సర్వీస్ వింగ్ బ్లింకిట్ కంపెనీ రూ. 999 విలువైన వస్తువులను కొనుగోలు చేస్తే రూ. 200 తగ్గింపు వోచర్‌ను అందిస్తోంది. ఈ వోచర్‌ని ఉపయోగించి పుష్ప-2 చిత్రాన్ని చూడవచ్చు.

పుష్ప-2 సినిమా చూడాలంటే బ్లింకిట్ కంపెనీ యాప్‌లోకి వెళ్లాల్సిందే. అక్కడ రూ.999 విలువైన వస్తువులను ఆర్డర్ చేసిన తర్వాత మీరు ఈ ఆఫర్‌ను పొందుతారు. ఈ ఆఫర్ ప్రతి కస్టమర్‌కు ఒక్కసారి మాత్రమే అందుబాటులో ఉంటుంది. భారతదేశంలోని ఏ సినిమా థియేటర్‌లోనైనా సీటు కోసం దీనిని రీడీమ్ చేసుకోవచ్చు. ఈ సినిమా టిక్కెట్ ధర కంటే రూ. 200 తక్కువ చెల్లించాలి. దీని కోసం, టికెట్ కొనుగోలు చేసే ముందు బ్లింకిట్ నుండి అందుకున్న వోచర్ కోడ్‌ను నమోదు చేయాలి. ఈ వోచర్ కోడ్‌ను యాప్‌లో యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. Blinkit దాని వివరాలను మీకు WhatsAppలో కూడా పంపిస్తుంది.

ఆర్డర్ డెలివరీ తర్వాత ఈ సమాచారాన్ని బ్లింకిట్ సమ్మరీ పేజీలో అందిస్తోంది. ఈ తగ్గింపు టిక్కెట్ ధరపై మాత్రమే అందుబాటులో ఉంటుంది. సినిమా టిక్కెట్ బుకింగ్‌తో పాటు ఆర్డర్ చేసిన ఇతర వస్తువులు, కన్వీనియన్స్ ఛార్జీలపై ఈ ఆఫర్ వర్తించదు. ఈ బ్లింకిట్ ఆఫర్‌ను డిసెంబర్ 15 వరకు పొందవచ్చు. డిసెంబర్ 5న విడుదలైన అల్లు అర్జున్ చిత్రం పుష్ప-2 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా రూ.500 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా రూ.500 కోట్లు వసూలు చేసిన భారతీయ చిత్రంగా పుష్ప 2 నిలిచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories