జియో, ఎయిర్‌టెల్‌కు BSNL షాక్‌.. రోజుకు కేవలం రూ.5కే అన్‌లిమిటెడ్ కాల్స్!

జియో, ఎయిర్‌టెల్‌కు BSNL షాక్‌.. రోజుకు కేవలం రూ.5కే అన్‌లిమిటెడ్ కాల్స్!
x

జియో, ఎయిర్‌టెల్‌కు BSNL షాక్‌.. రోజుకు కేవలం రూ.5కే అన్‌లిమిటెడ్ కాల్స్!

Highlights

ప్రైవేట్ టెలికాం కంపెనీలు వరుసగా టారిఫ్‌లు పెంచుతూ, కొన్ని రీచార్జ్ ప్లాన్లను పూర్తిగా రద్దు చేస్తూ వినియోగదారులపై భారం మోపుతున్న సమయంలో ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ బడ్జెట్‌ యూజర్ల కోసం అద్భుతమైన ఆఫర్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.

కేవలం రూ.147 రీచార్జ్‌తో 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్‌తో దేశంలో ఎటువంటి నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్ చేయొచ్చు. అంతేకాకుండా 10 GB హై స్పీడ్ డేటా కూడా అందుతుంది. అంటే రోజుకు కేవలం రూ.5తోనే ఈ ప్రయోజనాలు పొందొచ్చు.

అయితే ఇందులో ఒక చిన్న పరిమితి ఉంది. కేటాయించిన 10 GB డేటా పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 40 kbps‌కు పడిపోతుంది. అందువల్ల ఎక్కువ డేటా వాడే వారికి ఇది సరైన ఎంపిక కాకపోయినా, ప్రధానంగా కాల్స్ ఎక్కువగా చేసే యూజర్లకు మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్‌గా మారనుంది.

ప్రస్తుతం పెరుగుతున్న రీచార్జ్ ధరల మధ్య బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ఈ కొత్త ప్లాన్‌ సాధారణ వినియోగదారులను బాగా ఆకట్టుకుంటోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories