8th Pay Commission: ఉద్యోగులకు కేంద్రం బిగ్ షాక్..జీతం, పెన్షన్ పెంపు ఇప్పట్లో లేనట్లే?

8th Pay Commission: ఉద్యోగులకు కేంద్రం బిగ్ షాక్..జీతం, పెన్షన్ పెంపు ఇప్పట్లో లేనట్లే?
x
Highlights

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 8వ వేతన సంఘం ప్రకారం జనవరి 2026 నుంచి జీతాలు, పెన్షన్లలో పెంపు ఉంటుందని ఆశించారు. కానీ వారి...

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 8వ వేతన సంఘం ప్రకారం జనవరి 2026 నుంచి జీతాలు, పెన్షన్లలో పెంపు ఉంటుందని ఆశించారు. కానీ వారి ఆశలు నెరవేరే విధంగా కనిపించడం లేదు. జీతం, పెన్షన్ పెరుగుదల కోసం వారు ఇంకొంత కాలం వేచి ఉండాల్సి రావచ్చు. ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ లోని ఒకరిపోర్టు ప్రకారం 8వ వేతన సంఘం సిఫార్సులను జనవరి 2026 నాటికి కాకుండా 2027 నాటికి అమలు చేయవచ్చు. దీనికి కారణం వేతన సంఘం సిఫార్సులను అమలు చేయడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది.

వేతన సంఘం పదవీకాలం అధికారికంగా జనవరి 2026 నుంచి ప్రారంభం అవుతుంది. దాని కింద సవరించిన జీతం, పెన్షన్ లో మార్పులు 2027 వ సంవత్సరం వరకు అమలు కావు. అయితే కొత్త పే స్కేల్ అమలు చేయనప్పుడల్లా ఉద్యోగులు, పెన్షనర్లకు 12నెలల బకాయిలు లభిస్తాయి. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం వేతన సంఘం తన సిఫార్సులను ఖరారు చేసేందుకు 15 నుంచి 18 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఫైనల్ రిపోర్టు సమర్పించే ముందు వేతన సంఘం మధ్యంతర నివేదికను కూడా సమర్పించే అవకాశం ఉంటుంది. కానీ పూర్తి రిపోర్టు 2026 చివరి నాటికి వచ్చే అవకాశం ఉంది.

నివేదికల ప్రకారం కేంద్రమంత్రి వర్గం వచ్చే నెలలో 8వ వేతన సంఘం నిబంధనలను ఆమోదించవచ్చు. ప్రభుత్వ వేతన సంఘం ఏర్పాటు ప్రక్రియ చివరిలో దశలో ఉంది. మంత్రివర్గం దానిని ఆమోదించిన వెంటనే అధికారిక ప్రకటన చేస్తుంది. ఆ తర్వాత పే కమిషన్ ఏప్రిల్ 2025 నుంచి ప్రారంభం అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories