డీప్‌ఫేక్‌లకు కేంద్రం చెక్: ఏఐ కంటెంట్‌పై సోషల్ మీడియాకు కఠిన ఆదేశాలు.. ఆ వీడియో గుర్తిస్తే 3 గంటల్లోనే తొలగించాలి!

డీప్‌ఫేక్‌లకు కేంద్రం చెక్: ఏఐ కంటెంట్‌పై సోషల్ మీడియాకు కఠిన ఆదేశాలు.. ఆ వీడియో గుర్తిస్తే 3 గంటల్లోనే తొలగించాలి!
x
Highlights

Central Govt New Rules for AI Content: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పేరుతో సాగుతున్న దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.

Central Govt New Rules for AI Content: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పేరుతో సాగుతున్న దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఏఐ జనరేటెడ్ కంటెంట్, డీప్‌ఫేక్‌ల వల్ల తలెత్తుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి సామాజిక మాధ్యమాలకు అత్యంత కీలకమైన మార్గదర్శకాలను జారీ చేసింది.

తప్పనిసరిగా 'లేబుల్' ఉండాల్సిందే!

ఏఐ ద్వారా రూపొందించిన ఫోటోలు, వీడియోలు లేదా ఆడియోలకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు తప్పనిసరిగా 'ఏఐ జనరేటెడ్' (AI Generated) అనే లేబుల్‌ను వేయాలని కేంద్రం ఆదేశించింది. సామాన్యులు కూడా అది ఏఐ కంటెంట్ అని సులభంగా గుర్తించేలా ఆ లేబుల్ స్పష్టంగా ఉండాలి. ఒకసారి లేబుల్ వేసిన తర్వాత దానిని తొలగించడానికి గానీ, మెటా డేటాను మార్చడానికి గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

3 గంటల్లోనే తొలగింపు!

ప్రభుత్వం విధించిన నిబంధనలలో అత్యంత కీలకమైనది 'తొలగింపు గడువు'. ఏదైనా ఏఐ కంటెంట్ లేదా డీప్‌ఫేక్ కంటెంట్‌ను తొలగించాలని ప్రభుత్వం లేదా కోర్టులు ఆదేశిస్తే, సదరు సోషల్ మీడియా సంస్థ కేవలం 3 గంటల లోపు దానిని ప్లాట్‌ఫామ్ నుండి తొలగించాల్సి ఉంటుంది.

యూజర్లకు అప్రమత్తం.. ఆటోమేటెడ్ టూల్స్:

ఏఐ కంటెంట్‌ను దుర్వినియోగం చేస్తే ఎదురయ్యే చట్టపరమైన పరిణామాలు, జైలు శిక్షల గురించి ప్రతి మూడు నెలలకోసారి యూజర్లకు సందేశాలు (Messages) పంపాలని కేంద్రం సూచించింది. అసభ్యకర, మోసపూరిత కంటెంట్‌ను గుర్తించేందుకు ప్లాట్‌ఫామ్‌లు సొంతంగా 'ఆటోమేటెడ్ టూల్స్' (AI Detection Tools) ఉపయోగించాలని కేంద్రం ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories