LPG Cylinder Price Hike: బడ్జెట్ ముందే 'సిలిండర్' బాంబు: భారీగా పెరిగిన ధరలు.. హోటల్ తిండి ప్రియం కానుందా?

LPG Cylinder Price Hike
x

LPG Cylinder Price Hike: బడ్జెట్ ముందే 'సిలిండర్' బాంబు: భారీగా పెరిగిన ధరలు.. హోటల్ తిండి ప్రియం కానుందా?

Highlights

LPG Cylinder Price Hike: బడ్జెట్ ముందే సామాన్యులకు షాక్! వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 50 పెంచుతూ చమురు కంపెనీల నిర్ణయం. హోటల్ తిండ్లు, చిరుతిళ్ల ధరలు పెరిగే అవకాశం. గృహ వినియోగ సిలిండర్ ధరలో మార్పు ఉందా?

LPG Cylinder Price Hike: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగానికి మరికొన్ని గంటల సమయం ఉందనగా, సామాన్యుడిపై ధరల భారం పడింది. ప్రతి నెలా ఒకటో తేదీన ధరలను సవరించే ప్రభుత్వ రంగ చమురు సంస్థలు.. ఫిబ్రవరి 1న ఎల్‌పీజీ (LPG) వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. కమర్షియల్ సిలిండర్ ధరను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

వాణిజ్య సిలిండర్‌పై రూ. 50 పెంపు

తాజా సవరణ ప్రకారం.. 19 కేజీల వాణిజ్య (Commercial) సిలిండర్ ధరపై రూ. 50 పెరిగింది. అయితే గృహ అవసరాలకు వాడే 14.2 కేజీల సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు చేయకపోవడం గృహిణులకు కాస్త ఊరటనిచ్చే అంశం.

ప్రధాన నగరాల్లో కొత్త ధరలు (19 కేజీల సిలిండర్):

ఢిల్లీ: రూ. 1,740.50 (పాత ధర రూ. 1,690.50)

ముంబై: రూ. 1,692.00

కోల్‌కతా: రూ. 1,844.50

చెన్నై: రూ. 1,899.50

సామాన్యుడిపై ప్రభావం ఎలా ఉంటుంది?

వాణిజ్య సిలిండర్ ధర పెరిగితే మనకేం సంబంధం అని అనుకుంటే పొరపాటే. హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు మరియు ఫుడ్ స్టాల్స్‌లో ఈ సిలిండర్లనే వాడతారు. గ్యాస్ భారం పెరగడంతో యాజమాన్యాలు టిఫిన్లు, భోజనం మరియు ఇతర ఆహార పదార్థాల ధరలను పెంచే అవకాశం ఉంది. ఫలితంగా పరోక్షంగా ఈ భారం సామాన్యుడి జేబుకే చిల్లు పెడుతుంది.

డొమెస్టిక్ గ్యాస్ ధరలు స్థిరం

ఇళ్లలో వాడే 14.2 కేజీల సిలిండర్ ధర ప్రస్తుతం రూ. 887.50 వద్ద స్థిరంగా ఉంది.

తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద రూ. 500 కే సిలిండర్ అందిస్తోంది.

ఆంధ్రప్రదేశ్: దీపం పథకం ద్వారా ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల హామీ అమలవుతోంది.

ఉజ్వల లబ్ధిదారులు: కేంద్రం ఇచ్చే రూ. 300 సబ్సిడీ కొనసాగుతోంది.

భవిష్యత్తులో మరింత పెరిగే ఛాన్స్?

అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు చమురు ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గించి, వెనిజులా వైపు భారత్ మొగ్గు చూపుతోంది. రవాణా ఖర్చులు పెరిగితే, మార్చి నెలలో గృహ వినియోగ గ్యాస్ ధరలపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేటి బడ్జెట్‌లో ఇంధన ధరల నియంత్రణకు కేంద్రం ఎలాంటి చర్యలు ప్రకటిస్తుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories