Crypto Currency: క్రిప్టో మార్కెట్లో పెను తుఫాను.. నట్టింట్లో మునిగిపోయిన ఇన్వెస్టర్లు

Crypto Currency: క్రిప్టో మార్కెట్లో పెను తుఫాను.. నట్టింట్లో మునిగిపోయిన ఇన్వెస్టర్లు
x
Highlights

Crypto Currency: ఇటీవల కాలంలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత క్రిప్టో మార్కెట్ మంచి పెరుగుదలను నమోదు చేసింది.

Crypto Currency: ఇటీవల కాలంలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత క్రిప్టో మార్కెట్ మంచి పెరుగుదలను నమోదు చేసింది. ఇన్వెస్టర్లు భారీ లాభాలను ఆర్జించారు. ఆ ఆనందం కొద్ది రోజుల్లోనే ఆవిరైపోయింది. క్రిప్టోకరెన్సీ మార్కెట్‌ ఇటీవల భారీ కుదుపులను ఎదుర్కొంటోంది. గత ఒక వారం కాలంలోనే టాప్ 50 క్రిప్టోకరెన్సీలలో 16 కాయిన్ల ధరలు 25శాతానికి పైగా పడిపోయాయి. ఈ భారీ నష్టాలలో ఎలన్ మస్క్‌కు ఇష్టమైన డోజీ కాయిన్, డొనాల్డ్ ట్రంప్ మీమ్ కాయిన్ కూడా ఉన్నాయి.

బిట్ కాయిన్, ఇథీరియం పరిస్థితి కూడా అంతే

క్రిప్టో ప్రపంచంలో అత్యంత విలువైన బిట్కాయిన్ గత వారం 6శాతం నష్టాన్ని చవిచూడగా, ఇథీరియం 21శాతం క్షీణించింది. ఈ తక్కువ ధరలు మరికొన్ని రోజులు కొనసాగవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

టాప్ 16 కాయిన్ల భారీ పతనం

* డొగీకాయిన్ - 25శాతం క్షీణించి 0.252డాలర్లకు చేరుకుంది.

* కార్డానో - 25శాతం తగ్గి 0.6978డాలర్ల వద్దకు చేరుకుంది.

* చెయిన్‌లింక్ - 27శాతం పడిపోయి 18.27డాలర్ల వద్దకు చేరుకుంది.

* అవలాంచే - 29శాతం తగ్గి 24.49డాలర్లకు పడిపోయింది.

* సుయి - 25శాతం తగ్గి 3.00డాలర్ల వద్దకు చేరుకుంది.

* హెదేరా - 25శాతం తగ్గి 0.2328డాలర్ల వద్దకు చేరుకుంది.

* పోల్కాడాట్ - 28శాతం తగ్గి 4.62డాలర్ల వద్దకు చేరుకుంది.

* పేపే - 30శాతం తగ్గి 0.059999డాలర్ల వద్దకు చేరుకుంది.

* నియర్ ప్రోటోకాల్ - 30శాతం తగ్గి 3.22డాలర్ల వద్దకు చేరుకుంది.

* ఆవే - 26శాతం తగ్గి 235.43డాలర్ల వద్దకు చేరుకుంది.

* ట్రంప్-మీమ్ కాయిన్ - 26శాతం తగ్గి 17.25డాలర్ల వద్దకు చేరుకుంది.

* క్రోనోజ్ - 27శాతం తగ్గి 0.093డాలర్ల వద్దకు చేరుకుంది.

* కాస్పా - 32శాతం తగ్గి 0.086డాలర్ల వద్దకు చేరుకుంది.

* రెండర్ - 31శాతం తగ్గి 4.31డాలర్ల వద్దకు చేరుకుంది.

* ఫైల్‌కాయిన్ - 33శాతం తగ్గి 3.26డాలర్ల వద్దకు చేరుకుంది.

* ఆర్బిట్రమ్ - 31శాతం తగ్గి 0.44డాలర్ల వద్దకు చేరుకుంది.

మొత్తం మార్కెట్‌లో 2.50శాతం పతనం

గత 24 గంటల్లోనే క్రిప్టో మార్కెట్ విలువ 2.50శాతం తగ్గింది. ముఖ్యంగా బిట్ కాయిన్, ఇథీరియం వంటి ప్రధాన క్రిప్టోలు నష్టపోయిన కారణంగా మరిన్ని కాయిన్లపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. బిట్ కాయిన్ ప్రస్తుతం 96,160డాలర్ల వద్ద ట్రేడవుతోంది. కానీ మరింత పతనం వచ్చే అవకాశం ఉంది. ఇథీరియం ఇప్పటికే 20శాతం తగ్గి, భవిష్యత్తులో మరింత నష్టపోవచ్చు. క్రిప్టో మార్కెట్‌లో నెలకొన్న ఈ భారీ ఊహించని కుదుపులతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories