Discount on Gold: అక్కడ బంగారం పై భారీ డిస్కౌంట్స్.. భలే చౌక బేరం కానీ..

Discount on Gold: యుద్ధ ప్రభావం బంగారం ధరలపై పడింది. దుబాయ్ లో బంగారం ధరలపై భారీ డిస్కౌంట్స్ ఇస్తున్నారు అక్కడి వ్యాపారులు
x

Discount on Gold

Highlights

Discount on Gold: మధ్య ప్రాచ్యంలో యుద్ధ ప్రభావం బంగారం ధరలపై పడింది. దుబాయ్ లో బంగారం ధరలు బాగా తగ్గడమే కాకుండా భారీ డిస్కౌంట్స్ ఇస్తున్నారు అక్కడి వ్యాపారులు

Discount on Gold: మధ్య ప్రాచ్యంలో యుద్ధ ప్రభావం బంగారంపై గట్టిగానే పడింది. నిజానికి యుద్ధం ప్రారంభం అయిన రోజున బాగా పెరిగిన బంగారం ధరలు తరువాత నుంచి తగ్గిపోవడం ప్రారంభం అయింది. దాదాపుగా ఇది ఎవరూ ఊహించని పరిణామం. అయితే, బంగారం ఎక్కువగా ఎగుమతి చేసే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పరిస్థితులు ప్రస్తుతం అంత బాగాలేవు. ఇరాన్ అరబ్ దేశాలను టార్గెట్ చేయడంతో అక్కడ విమాన ప్రయాణాలకు అంతరాయం కలిగింది. దీంతో బంగారం ఎగుమతి కూడా నిలిచిపోయింది. ఇప్పుడు కొద్దిగా విమానాలు తిరుగుతున్నా అక్కడ నుంచి మునుపటి స్థాయిలో బంగారాన్ని ఎగుమతి చేసే అవకాశం లేకుండా పోయింది. యూఏఈ ఆసియాకు చెందిన అన్ని దేశాల కొనుగోలు దారులకు బంగారాన్ని శుద్ధి చేయడానికి, ఎగుమతి చేయడానికి ప్రధాన కేంద్రం. ఇప్పుడున్న పరిస్థితులు ఎగుమతులకు సహకరించకపోవడంతో అక్కడ బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.

దుబాయ్‌లో భారీగా తగ్గిన బంగారం ధరలు..

Discount on Gold: బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ ప్రకారం, చాలా మంది కొనుగోలుదారులు బంగారం కొత్త కొనుగోళ్లను వాయిదా వేసుకున్నారు. ఎక్కువ రవాణా చార్జీలు అదేవిధంగా భారీగా పెరిగిన ఇన్సూరెన్స్ చార్జీలను భరించడానికి వారు సిద్ధ పడడం లేదు. ఒకవేళ అందుకు సిద్ధపడిన డెలివరీ ఎప్పటికి అవుతుందనే కచ్చితమైన సమాచారం లేదు. దీంతో బంగారానికి డిమాండ్ తగ్గిపోయింది. ఈ పరిణామం సహజంగానే బంగారం ధరలు తగ్గడానికి కారణమైంది. ,

దీంతో అక్కడి వ్యాపారులు లండన్‌లోని బెంచ్‌మార్క్ ధరతో పోలిస్తే ఔన్సుకు $30 వరకు తగ్గింపుతో బంగారాన్ని అందించడం ప్రారంభించారని బ్లూమ్ బెర్గ్ రిపోర్ట్ పేర్కొంది.

అయితే, దుబాయ్ నుంచి బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకునే భారత్ నుంచి కూడా దిగుమతుల కోసం ఒత్తిళ్లు లేవని తెలుస్తోంది. జనవరిలో ఎక్కువ దిగుమతులు చేసుకోవడంతో ప్రస్తుతం డిమాండ్ తక్కువగా ఉండడం.. నిల్వలు ఎక్కువగా ఉండడం దీనికి కారణమని మెటల్స్ ఫోకస్‌లో దక్షిణాసియా ప్రధాన సలహాదారు చిరాగ్ షేత్ ను ఉటంకిస్తూ బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొంది.

జనవరిలో గణనీయమైన దిగుమతులు నమోదైన తర్వాత స్వల్పకాలంలో డిమాండ్ తక్కువగా ఉందని మరియు నిల్వలు సాపేక్షంగా ఎక్కువగా ఉన్నాయని మెటల్స్ ఫోకస్‌లో దక్షిణాసియా ప్రధాన సలహాదారు చిరాగ్ షేత్ బ్లూమ్‌బెర్గ్‌తో అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories