Post Office Saving Schemes: మీ సేవింగ్స్‌కు ఎక్కువ వడ్డీ కావాలనుకుంటున్నారా? అయితే.. పోస్టాఫీసులు మీకు బెస్ట్ ఆప్షన్

Post Office Saving Schemes
x

Post Office Saving Schemes: మీ సేవింగ్స్‌కు ఎక్కువ వడ్డీ కావాలనుకుంటున్నారా? అయితే.. పోస్టాఫీసులు మీకు బెస్ట్ ఆప్షన్

Highlights

Post Office Saving Schemes: డబ్బును ఎక్కడ డిపాజిట్‌ చేసినా దానికి మంచి వడ్డీ ఉంటేనే సంతృప్తి. అప్పుడే కదా నాలుగు డబ్బులు వెనక వేసుకోగలుతాం. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ పాలసీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

Post Office Saving Schemes: డబ్బును ఎక్కడ డిపాజిట్‌ చేసినా దానికి మంచి వడ్డీ ఉంటేనే సంతృప్తి. అప్పుడే కదా నాలుగు డబ్బులు వెనక వేసుకోగలుతాం. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ పాలసీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంకులో ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు భారీగా తగ్గిపోయాయి. మరి ఇప్పుడు కస్టమర్ల పరిస్థితి ఏంటి? ఎక్కువ వడ్డీ కావాలంటే ఇక నంచి డబ్బును ఎక్కడ డిపాజిట్ చేయాలి? అంటే దీనికి బెస్ట్ ఆప్షన్ పోస్టాఫీసు. పోస్టాఫీసులో ఎక్కువ వడ్డీ వచ్చే పథకాలు చాలా ఉన్నాయి. మరి ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పోస్టాఫీసులో డిపాజిట్లు చేస్తే అత్యంత సురక్షితం. ఎందుకంటే పోస్టాఫీసులో ఉన్న పథకాలకు కేంద్ర ప్రభుత్వం హామీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ డిపాజిట్ చేయడం సురక్షితం. అలాగే ఎక్కువ వడ్డీ రేట్లను కూడా ఈ పథకాలు ఇప్పుడు ఇస్తున్నాయి. సురక్షితం మరియు వడ్డీ ఎక్కువ ఉండడంతో ఇప్పుడు అందరూ ఈ పథకాల ద్వారా పోస్టాఫీసులో డిపాజిట్లు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఎలాంటి పథకాలు ఉన్నాయి?

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్

ఈ పథకం ద్వారా సంవత్సరానికి గరిష్టంగా రూ.1.5 లక్షలు డిపాజిట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా వార్షిక వడ్డీ రేటు 7.1 శాతంగా కేంద్రం అందిస్తోంది. బ్యాంకుల్లోని చాలా ఎఫ్‌డీ స్కీమ్ల కంటే కూడా ఇది చాలా ఎక్కువ.

జీవిత భాగస్వామిపేరుతో ఖాతా

అదేవిధంగా మీ జీవిత భాగస్వామి పేరు మీద కూడా ఒక ఖాతా తీసుకోవచ్చు. ఇది కూడా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ మాదిరిగా ఏడాదికి రూ.1.5లు డిపాజిట్ చేసుకోవచ్చు. దీనికి కూడా ఎక్కువ వడ్డీ వస్తుంది.

పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్

పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీములు అంటే బ్యాంకుల్లో ఉండే ఫిక్స్ డ్ డిపాజిట్లే. బ్యాంకుల్లో అయితే ఎలా డిపాజిట్ చేస్తామో ఇక్కడ కూడా అలాగే చేయొచ్చు. ఒకవేళ రెండేళ్లలో ఒక రూ. 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే దానికి 7 శాతం వడ్డీ వస్తుంది. అంటే మెచ్యూరిటీ సమయానికి రూ.2,29,776 లు వస్తుంది. అయితే సంవత్సరాల కాలాన్ని బట్టివ వడ్డీ రేటు ఉంటుంది. ఉదాహరణకు సంవత్సరానికి డిపాజిట్ చేస్తే 6.9 శాతం వడ్డీ, రెండు సంవత్సరాలకు చేస్తే 7.0 శాతం వడ్డీ ఉంటుంది. అలాగే 3 ఏళ్లకు 7.1 శాతం వడ్డీ, 4ఏళ్లకు 7.5శాతం వడ్డీ ఉంటుంది. బ్యాంకులతో పోలీస్తే ఈ వడ్డీ రేట్లు అన్నీ ఎక్కువే. పైగా కేంద్రప్రభుత్వం హామీ ఉంటుంది కాబట్టి ఇవి సురక్షితం. కాబట్టి పోస్టాఫీసు ఫథకాలను కూడా ఫిక్స డ్ డిపాజిట్ల కోసం ఎంచుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories