Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

Stock Market: సెన్సెక్స్ 285.94, నిఫ్టీ 93.85 పాయింట్ల లాభం

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 31 July 2024 10:15 PM IST
Domestic stock market indices ended in gains
X

Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్‌టెల్‌ వంటి షేర్ల అండతో సరికొత్త గరిష్ఠాల వద్ద స్థిరపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలూ కలిసొచ్చాయి. సెన్సెక్స్‌ 81 వేల 655.90 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 81 వేల 828.04 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ... చివరికి 285.94 పాయింట్ల లాభంతో 81 వేల 741.34 వద్ద ముగిసింది. నిఫ్టీ 93.85 పాయింట్ల లాభంతో 24 వేల 951.15 వద్ద స్థిరపడింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story