Stock Market: నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market: సెన్సెక్స్ 139, నిఫ్టీ 38 పాయింట్ల నష్టం

Shekhar G
Published on: 20 Nov 2023 6:04 PM IST
Domestic Stock Markets Ended With Losses
X

Stock Market: నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు 

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాలతో ముగిశాయి. ప్రతికూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు మధ్య కాస్త కోలుకున్నప్పటికీ ... ఎక్కువ సేపు లాభాలను నిలబెట్టుకోలేకపోయాయి. వాహన రంగ షేర్లు సూచీలను కిందకు లాగాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు సూచీలపై ప్రభావం చూపాయి. మరోవైపు రూపాయి బలహీనత ప్రతికూలంగా మారింది. సెన్సెక్స్ 65, 787 దగ్గర నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 65,844 దగ్గర గరిష్టాన్ని , 65,547 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. చివరకు 139 పాయింట్ల నష్టతో 65,655 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 19,731 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 19,756-19,670 మధ్య కదలాడింది. చివరకు 37 పాయింట్లు కుంగి 19,684 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 9పైసలు కుంగి 83.35 వద్ద నిలిచింది.

Shekhar G

Shekhar G

Next Story