America: ట్రంప్‌ నిర్ణయంతో మాంసం ధరలు పెరుగుతాయా? షాకింగ్‌ ఫ్యాక్ట్!

Chicken Alcohol Tariff Price
x

America: ట్రంప్‌ నిర్ణయంతో మాంసం ధరలు పెరుగుతాయా? షాకింగ్‌ ఫ్యాక్ట్!

Highlights

Chicken, Alcohol Tariff Price: ట్రంప్ విధించిన తాజా టారిఫ్‌లు వల్ల భారత సీఫుడ్, మాంసం, ప్రాసెస్డ్ ఫుడ్ రంగాలు గణనీయంగా దెబ్బతింటాయి. అమెరికాలో భారత ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉండగా, మన దేశంలోనూ ధరల పెరుగుదల స్పష్టంగా కనిపించొచ్చు.

Chicken, Alcohol Tariff Price: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా టారిఫ్ నిర్ణయం భారతీయ వ్యాపార రంగానికి గట్టి ఎదురుదెబ్బగా మారింది. ఏప్రిల్ 2న విడుదలైన ఈ 'లిబరేషన్ డే' ప్యాకేజీలో భాగంగా, భారత్‌ నుండి వచ్చే ముఖ్య ఎగుమతులపై 26 శాతం మేర సుంకాలు విధించబోతున్నట్టు అమెరికా వెల్లడించింది. గతంలో తక్కువగా ఉన్న ఇవే టారిఫ్‌లు ఇప్పుడు మామూలు స్థాయికి మించి ఉండబోతుండటం భారతీయ ఉత్పత్తుల పోటీతత్వాన్ని అమెరికా మార్కెట్‌లో బాగా తగ్గించనుంది.

ప్రధానంగా ప్రభావితమయ్యే రంగాలు సీఫుడ్, పశుపాల ఉత్పత్తులు, ప్రాసెస్డ్ ఫుడ్ పరిశ్రమలు. సుమారు 2.5 బిలియన్ డాలర్ల విలువైన రొయ్యలు, చేపలు, ఇతర మాంసాహార ఉత్పత్తులు అమెరికాకు భారత్‌ నుంచి ఎగుమతవుతుంటే, ఇప్పుడు వాటిపై దాదాపు 28 శాతం టారిఫ్ పడనుంది. ఇక పశువులు, వాటి ఆధారిత ఉత్పత్తులు, చక్కెర, కోకో వంటి ప్రాసెస్డ్ ఫుడ్ ఉత్పత్తులపైనా భారీ సుంకం విధించడం వల్ల భారత్‌కు చెందిన స్వీట్స్, స్నాక్స్, డెయిరీ ప్రోడక్ట్స్ అక్కడ ఖరీదైనవిగా మారతాయి.

అమెరికా తన వ్యాపార లోటును తగ్గించేందుకు ఈ విధంగా పరస్పర సుంక విధానాన్ని (Reciprocal Tariff System) తీసుకొచ్చింది. కానీ ఈ విధానం ఎలా అమలవుతుంది అన్న విషయమై ఇంకా స్పష్టత లేదు. ఉత్పత్తి ఆధారంగానా, రంగాల వారీగానా, లేక దేశాలస్థాయిలోనా అని ఎగుమతిదారుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. ట్రేడ్ ఒప్పందాలపై చర్చలు కొనసాగుతున్నప్పటికీ, అవి ఎప్పుడు ఫలప్రదమవుతాయో స్పష్టత లేదు. ఈ సుంకాల ప్రభావం రెండు వైపులా ఉంటుంది. ఒకవైపు అమెరికాలో భారతీయ ఉత్పత్తులు పోటీ తీరాన్ని కోల్పోతే, మరోవైపు భారత్‌లో సరఫరాలో లోటు వల్ల ధరలు పెరిగే అవకాశమూ ఉంది. దీంతో, అమెరికాలో ఉండే భారతీయులు తమ రోజువారీ జీవితాల్లో ఇది తీవ్రంగా ప్రభావితం చేయనున్నట్లు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories