Eid 2025 Bank Holiday: మార్చి 31వ తేదీ ఈద్‌.. సోమవారం రోజు బ్యాంకులు బంద్‌ ఉంటాయా?

Bank Holiday
x

Bank Holiday: మార్చి 31వ తేదీ ఈద్‌.. సోమవారం రోజు బ్యాంకులు బంద్‌ ఉంటాయా?

Highlights

EID 2025 Bank Holiday: మార్చి 31 ఈద్‌ సందర్భంగా అన్ని పబ్లిక్‌, ప్రైవేటు కార్యాలయాలతోపాటు స్కూళ్లకు సెలవులు ఉన్నాయి.

EID 2025 Bank Holiday: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ప్రకారం బ్యాంకులకు బంద్ ఉంటాయి. అయితే, మార్చి 31 ఈద్‌ ఉల్‌ ఫితర్‌ సందర్భంగా పబ్లిక్‌ హాలిడే ఉంది. ఈరోజు అన్ని పబ్లిక్‌, ప్రైవేటు కార్యాలయాలు బంద్‌ ఉంటాయి. అయితే, ఈరోజు బ్యాంకులు పనిచేస్తాయా? లేదా? ఈరోజు ఫైనాన్షియల్‌ ఇయర్‌ క్లోజ్‌. అయితే, ఈ ఫైనాన్షియల్‌ ఆపరేషన్స్‌ చేసే బ్యాంకులు ఈరోజు పనిచేస్తాయి. చెక్‌ కలెక్ట్‌, ఇతర క్లీయరింగ్ ఆపరేషన్స్‌ కూడా జరుపుకోవచ్చు. మాములు బ్యాంకింగ్‌ సమయాల మాదిరి పనిచేస్తాయి.

అయితే, హిమాచల్‌ ప్రదేశ్‌, మిజోరాం వంటి రాష్ట్రాల్లో బ్యాంకులకు ఈద్‌ ఉల్‌ ఫితర్‌ సందర్భంగా సెలవులు ఉంటాయి. అయితే, కొన్ని బ్యాంకు బ్రాంచీలు ఓపెన్‌ ఉండేలా చర్యలు తీసుకుంది ఆర్‌బీఐ. ప్రధాన ఏరియాల్లో బ్యాంకు బ్రాంచీలు యథావిధిగా పనిచేయనున్నాయి.

ఆదాయ శాఖ డిపార్ట్‌మెంట్లు ఈరోజు కూడా పనిచేయనున్నాయి. ప్రధానంగా అన్ని ట్యాక్స్‌కు సంబంధించిన యాక్టివిటీలు నిర్వహించే ఆఫీసులు ఓపెన్‌ ఉంటాయి. వీటికి మార్చి 29, 30, 31 సెలవు లేదు.

2024-25 ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. కాబట్టి సోమవారం మార్చి 31 బ్యాంకులు పనిచేస్తాయి. ఆదాయ పన్ను సంస్థలకు సంబంధించిన కొన్ని పెండింగ్ వర్కులు పూర్తి చేయాల్సి ఉంటుంది. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ ఆదేశాల మేరకు ఈ సంస్థలకు సెలవు లేదు.

ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి పన్ను చెల్లించేవారు త్వరగా చెల్లించేయండి. కాస్త ముందుగానే మీ పని పూర్తి చేసి ఉంటే మరీ మంచిది. చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా ఉంటారు.

ఇది కాకుండా ఐఆర్‌డీఏఐ కూడా రోజుల్లో పనిచేస్తుంది. పాలసీదారులు ఇబ్బందులు పడకుండా ఈ సంస్థ పనిచేయనుంది. పాలసీలకు సంబంధించిన క్లెయిమ్స్‌, ప్రాసెసింగ్ పనులు ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories