Tesla: టెస్లాకు భారీ షాక్.. ఆటోపైలట్ ప్రమాదంపై కోర్టులో కేసు

Tesla
x

Tesla: టెస్లాకు భారీ షాక్.. ఆటోపైలట్ ప్రమాదంపై కోర్టులో కేసు

Highlights

Tesla: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇప్పుడు అమెరికాలో ఒక కేసును ఎదుర్కోబోతోంది. టెస్లా ఆటోపైలట్ సిస్టమ్ వల్ల ఒక మహిళ మరణించిన కేసు వచ్చే నెల ట్రయల్ కోసం కోర్టుకు వెళ్ళబోతోంది.

Tesla: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇప్పుడు అమెరికాలో ఒక కేసును ఎదుర్కోబోతోంది. టెస్లా ఆటోపైలట్ సిస్టమ్ వల్ల ఒక మహిళ మరణించిన కేసు వచ్చే నెల ట్రయల్ కోసం కోర్టుకు వెళ్ళబోతోంది. కంపెనీ కేసు నమోదైన తర్వాత దీన్ని కొట్టివేయాలని ప్రయత్నించింది.. కానీ అమెరికాలోని ఒక కోర్టు దీన్ని తిరస్కరించింది. ఈ సంఘటన ఫ్లోరిడాలోని కీ లార్గోలో జరిగింది. ఒక ఆటోపైలట్ ఫీచర్స్‌తో కూడిన మోడల్ ఎస్ కారు రోడ్డు పక్కకు వచ్చి ఒక మహిళను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కారు డిజైన్ సరిగా లేదని, సరైన హెచ్చరికలు ఇవ్వలేదని ఆరోపిస్తూ మహిళ కుటుంబ సభ్యులు టెస్లాపై కేసు పెట్టవచ్చని కోర్టు చెప్పింది. అంతేకాకుండా, వారు నష్టపరిహారం కూడా కోరవచ్చని తెలిపింది. ఈ కేసులో జూలై 14 నుండి ట్రయల్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

టెస్లా కంపెనీ సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ భద్రతపై చాలా కాలంగా ప్రశ్నలు వస్తున్నాయి. తమ ఆటోపైలట్ ఫీచర్లు పూర్తిగా అప్రమత్తంగా ఉండి, స్టీరింగ్‌ను పట్టుకుని ఉండే డ్రైవర్ల కోసం మాత్రమే అని కంపెనీ చెబుతోంది. ఈ టెక్నాలజీ కారును పూర్తిగా దానంతట అదే నడపదని కూడా చెబుతోంది. ఈ కేసు ఏప్రిల్ 25, 2019 నాటిది. జార్జ్ మ్యాగీ అనే వ్యక్తి తన కారును దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో నడుపుతున్నాడు. ఈ సమయంలో కారు రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఒక ఎస్‌యూవీని ఢీకొట్టింది. ఆ ఎస్‌యూవీ పక్కనే ప్రమాదానికి గురైన మహిళ, ఆమె స్నేహితుడు నిలబడి ఉన్నారు. అతను కారు నడుపుతూ మొబైల్ ఫోన్ తీసుకోవడానికి కిందకు వంగాడు. అదే సమయంలో స్టాప్ సైన్, రెడ్ లైట్ వద్ద ఆగకుండా దాటి వెళ్ళిపోయాడు. అతనికి ఎలాంటి హెచ్చరిక రాలేదని, కారు ఎస్‌యూవీని ఢీకొట్టిందని, దీంతో ఎస్‌యూవీ ఆ ఇద్దరినీ ఢీకొట్టిందని మ్యాగీ తెలిపాడు.

ఈ ప్రమాదంలో మహిళ దాదాపు 75 అడుగుల దూరం ఎగిరిపడి, అక్కడికక్కడే మరణించింది. ఆమె స్నేహితుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ కేసులో 98 పేజీల తీర్పులో కోర్టు మాట్లాడుతూ.. ఆటోపైలట్ లోపాలు ఈ ప్రమాదానికి ఒక ముఖ్య కారణమని భావించడానికి బాధితుల పక్షం తగినన్ని ఆధారాలు సమర్పించిందని పేర్కొంది. ఆటోపైలట్‌తో ముడిపడి ఉన్న ప్రమాదాలు కారులోని టచ్‌స్క్రీన్ మాన్యువల్‌లో స్పష్టంగా లేవని, సాధారణ వ్యక్తి వాటిని సులభంగా అర్థం చేసుకోలేడని కోర్టు చెప్పింది.

Show Full Article
Print Article
Next Story
More Stories